ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం

  • Published By: chvmurthy ,Published On : February 17, 2020 / 03:31 AM IST
ప్రముఖ సినీ హీరో  శ్రీకాంత్ ఇంట్లో విషాదం

Updated On : February 17, 2020 / 3:31 AM IST

ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.   శ్రీకాంత్ తండ్రి  మేక పరమేశ్వరరావు(70) ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన  గత నాలుగు నెలలుగా స్టార్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. 

సోమవారం మధ్యాహ్నం మహా ప్రస్ధానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1948  మార్చి 16న కృష్ణాజిల్లా  మేకావారి పాలెంలో జన్మించిన  పరమేశ్వరరావు కర్ణాటక రాష్ట్రంలోని గంగావతికి వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝూన్సీలక్ష్మి. కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.