Mission Impossible : మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 రివ్యూ.. మిషన్ పూర్తయిందా?
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఇండియాలో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1 సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

Tom Cruise Mission Impossible Dead Reckoning Part One Movie Telugu Review and Rating
Mission Impossible Dead Reckoning Part One : హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల సిరీస్ లలో మిషన్ ఇంపాజిబుల్ ఒకటి. ఇప్పటివరకు ఈ సిరీస్ లో వచ్చిన ఆరు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ముఖ్య పాత్రలో ఈ సిరీస్ తెరకెక్కింది. తాజాగా ఈ సిరీస్ లో ఏడవ సినిమా రిలీజ్ అయింది. మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 పేరుతో నేడు జులై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో టామ్ క్రూజ్ తో పాటు హ్యాళి అట్వేల్, వింగ్ రహ్మస్, సిమెన్ పెగ్, రెబెకా, వనీస్.. ఇలా పలువురు హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో నటించారు.
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఇండియాలో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మిషన్ ఇంపాజిబుల్ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
కథ విషయానికి వస్తే ఈ సారి ఇప్పటి జనరేషన్ తగ్గట్టు ఆలోచించి AI ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడారు హీరో మరియు అతని టీం అనే లైన్ ని తీసుకున్నారు. కొంతమంది ప్రపంచాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవాలని ఓ సీక్రెట్ AI తయారు చేస్తారు. కానీ అది వాళ్ళ మాట కూడా వినకుండా తనంతట తాను పని చేస్తూ ప్రపంచ వినాశనానికి కారణం అవ్వడానికి రెడీగా ఉంటుంది. దాన్ని నాశనం చేయడానికి ఆ AI సోర్స్ ఎక్కడ ఉంది, దాని తాళం కోసం హీరో అండ్ టీం చేసే పోరాటమే మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1.
Rashmika Mandanna : నితిన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్మిక మందన్న..? మళ్లీ మొదటికే..!
కథనం విషయానికి వస్తే ఈ సిరీస్ లోని అన్ని సినిమాలలాగే అన్ని అంశాలు ఉండేలా చూసుకొని మెప్పించారు. ఫస్ట్ హాఫ్ లో కాసేపు కామెడీ కూడా ఫుల్ గా నవ్విస్తుంది. సెకండ్ హాఫ్ మొదట్లో ఎమోషనల్ సీన్స్ తో మెప్పించారు. ఇక ఈ సిరీస్ సినిమాల్లో థ్రిల్లింగ్ సన్నివేశాలు చాలా ఉంటాయని తెలిసిందే. ఈ సినిమాలో కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సీన్స్ చాలా ఉన్నాయి. చివరి అరగంట అయితే ఏమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తాము. అయితే సినిమా క్లైమాక్స్ లో AI ని నాశనం చేయడానికి కావాల్సిన కీ వీళ్ళకి దొరికినా అది నాశనం చేసినట్టు చూపించరు. దీంతో ఎలాగో పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు కాబట్టి కథ పార్ట్ 2లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1 గత సినిమాల్లాగే ప్రేక్షకులని థ్రిల్ చేస్తుంది. ఇక దీని పార్ట్ 2 వచ్చే సంవత్సరం జూన్ లో వస్తుందని ప్రకటించారు.