ఈ సినిమాలు ఎన్ని సంవత్సరాలు ఆడాయో తెలుసా!

Top 10 Longest Theatrical Run Films: మారుతున్న కాలంతోపాటు సినిమా రంగం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటోంది. టెక్నాలజీ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు ఎప్పటికప్పుడు కొత్తదనాని, కొత్త ప్రయత్నాలకు, ప్రయోగాలకు ముందుంటుంది సినిమా పరిశ్రమ. టీవీ, కలర్ టీవీ, ఆరుబయట తెరలు, చిన్నపాటి గుడారాలు, సింగిల్ స్క్రీన్ తర్వాత ఏసీ, డీటీఎస్ థియేటర్లు, హోమ్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు.. ఇప్పుడు ఓటీటీలు ఇలా సినిమా అనే వినోద సాధనం ప్రేక్షకుడి అరచేతిలోకి వచ్చేసింది. కానీ ఇవేవీ థియేటర్ satisfaction ఇవ్వలేవని కొత్తగా చెప్పనవసరం లేదు.
ప్రేక్షకాదరణతో ఒకప్పుడు ఒకే థియేటర్లో సంవత్సరం పాటు ఆడిన సినిమాలున్నాయి. తర్వాత వందల రోజుల్లోకి ఆ తర్వాత యాభై రోజుల నుంచి 4 వారాలు, రెండు వారాల వరకు వచ్చేశాయి. కానీ అడపాదడపా రికార్డ్ స్థాయిలో ఆడిన సినిమాలున్నాయి. అలా వందల రోజులకొద్ది వెండితెరపై సందడి చేసిన టాప్ 10 తెలుగు సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.
నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మాస్ బొమ్మ ‘లెజెండ్’ ప్రొద్దుటూరు (కడప) అర్చన థియేటర్లో 1005 రోజులపాటు ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన హిస్టారికల్ హిట్ ‘మగధీర’ మూవీ కర్నూలులో షిఫ్టింగ్ మీద 1001 రోజులు ఆడింది. సూపర్ స్టార్ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన చిత్రం‘పోకిరి’.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మాస్ హిట్ మూవీ కర్నూలులో 580 రోజులు నడిచింది.
ఇక సోలో హీరోగా బాలయ్యకు ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన కుటుంబ కథా చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’.. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా హైదరాబాద్‌లోని కాచిగూడలో 567 రోజులపాటు ప్రదర్శింపబడింది.
కె.బాలచందర్ తెరకెక్కించిన అద్భుతమైన ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరి ‘మరోచరిత్ర’ 556 రోజులు నడిచింది.
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి కలయికలో ఏఎన్నార్ తనయులు వెంకట్, నాగార్జున నిర్మించిన క్లాసికల్ మూవీ ‘ప్రేమాభిషేకం’ 533 రోజులపాటు ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించింది. నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో డైరెక్ట్ నాలుగు కేంద్రాల్లో 300 రోజులు ఆడిన చిత్రంగానూ రికార్డ్ నెలకొల్పింది ‘ప్రేమాభిషేకం’.
నటరత్న ఎన్టీఆర్, అంజలి దేవిలతో సి.పుల్లయ్య రూపొందించిన అద్భుత పౌరాణిక చిత్రం ‘లవకుశ’ 469 రోజులు.. టి.రాజేందర్ (కోలీవుడ్ యంగ్ హీరో శింబు తండ్రి) నటించి డైరెక్ట్ చేసిన ‘ప్రేమసాగరం’ 465 రోజులు.. నటరత్న ఎన్టీఆర్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన సూపర్ హిట్ ‘వేటగాడు’ 409 రోజులు.. అలాగే వీరి కలయికలోనే తెరకెక్కిన మరో చిత్రం ‘అడవిరాముడు’ 365 రోజులపాటు విజయంతంగా ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించాయి.