Identity Trailer : త్రిష ‘ఐడెంటిటీ’ ట్రైలర్ రిలీజ్.. ఫ్లైట్ లో యాక్షన్ సీన్స్ మాములుగా లేవుగా..
తాజాగా నేడు ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

Tovino Thomas Trisha Identity Movie Telugu Trailer Released
Identity Trailer : టోవినో థామస్, త్రిష(Trisha) మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మలయాళ సినిమా ఐడెంటిటీ. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన, దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది. జనవరి 2న మలయాళంలో రిలీజయి భారీ విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పటికే మలయాళంలో 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. వినయ్ రాయ్, మందిర బేడి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఐడెంటిటీ సినిమా ఇప్పుడు తెలుగులో జనవరి 24న రిలీజ్ కానుంది.
Also Read : Director Padmavathi Malladi : ప్రభాస్ సినిమాకు పనిచేసి.. ఇప్పుడు డైరెక్టర్ గా సుకుమార్ కూతురితో సినిమా..
తాజాగా నేడు ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాతలతో పాటు డైరెక్టర్, వినయ్ రాయి పాల్గొన్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక వ్యక్తి గురించి వెతుకుతున్నట్టు ఉంది. ఏదో సంఘటనను చూసిన వ్యక్తి – ఓ స్కెచ్ ఆర్టిస్ట్ – ఓ పోలీస్ ఆఫీసర్ – ఓ విలన్ మధ్యలో జరిగే కథలా తెలుస్తుంది. ఫ్లైట్ లో యాక్షన్స్ సీన్స్ చాలా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా మలయాళంలో ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి సమయానికి విడుదల చేద్దాం అనుకున్నా ఇక్కడ సినిమాలు ఉన్నాయి కాబట్టి 24వ తేదీన రిలీజ్ చేస్తున్నాము. ఇందులో యాక్షన్ చాలా బాగుంటుంది. అనుకోని కారణాల వల్ల హీరో టోవినో థామస్, హీరోయిన్ త్రిష ఈ ఈవెంట్ కి రాలేకపోయారు అని తెలిపారు. నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. హిట్ సినిమా ఐడెంటిటీని మామిడాల శ్రీనివాసరావు గారితో కలిసి సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమాలో నటించిన చాలా మంది తెలుగు వారికి పరిచయమే. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు.
Also Read : Bhairavam Teaser : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్.. మల్టీస్టారర్.. ‘భైరవం’ టీజర్ చూశారా?
దర్శకుడు అఖిల్ పాల్ మాట్లాడుతూ.. హీరో టోవినో థామస్ ఆల్మోస్ట్ మూడేళ్లు ఈ సినిమా కోసం నాతో కలిసి పనిచేసారు. మలయాళం సినిమాల బడ్జెట్ తో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ కొంచెం ఎక్కువే అయింది. ఈ సినిమా దేశమంతా రిలీజ్ చేయాలని ముందు నుంచి అనుకున్నాము. స్క్రిప్ట్ నుండి యాక్షన్ సీన్స్ వరకు అన్ని జాగ్రత్తగా డిజైన్ చేసాము. కేరళలో హిట్ అయినట్టు ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను అని తెలిపారు.
వినయ్ రాయ్ మాట్లాడుతూ.. తెలుగులో హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ నన్ను అందరికి గుర్తుండేలా అచేసారు. అలాగే మలయాళంలో కూడా అఖిల్ ఈ సినిమాతో నాకు అంత గుర్తింపు వచ్చేలా చేశారు. నా 18 ఏళ్ళ కెరీర్ లో ఇలాంటి కథను నేను ఎప్పుడూ వినలేదు. ఈ సినిమాలో యాక్షన్, సస్పెన్స్, స్టోరీ లైన్ ఇలా అన్నీ ఉన్నాయి. తెలుగు వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది అని చెప్పారు.