Bhairavam Teaser : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్.. మల్టీస్టారర్.. ‘భైరవం’ టీజర్ చూశారా?
మీరు కూడా భైరవం టీజర్ చూసేయండి..

Manchu Manoj Nara Rohith Bellamkonda Sai Sreenivas Bhairavam Movie Teaser Released
Bhairavam Teaser : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోలు కలిసి తెరకెక్కుతున్న సినిమా ‘భైరవం’. ఈ సినిమాలో నారా రోహిత్ కి జంటగా దివ్య పిళ్ళై, శ్రీనివాస్ జోడిగా అదితి శంకర్, మనోజ్ జోడిగా ఆనంది.. ఇలా ముగ్గురు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. జయసుధ కీలక పాత్రలో నటిస్తుంది. భైరవం సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై KK రాధామోహన్ నిర్మాణంలో దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నాడు.
Also Read : Balakrishna : బాలకృష్ణ సెంటిమెంట్.. ఆ కలర్ డ్రెస్ వేస్తే డేంజర్.. ఎందుకో తెలుసా? వేస్తే ఏమైందో తెలుసా?
ఇప్పటికే ఈ సినిమా నుంచి ముగ్గురు హీరోల పోస్టర్స్, ఒక సాంగ్, ఓ ఇంటర్వ్యూ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. మీరు కూడా టీజర్ చూసేయండి..
టీజర్లో జయసుధ వాయిస్ తో.. రాత్రి నాకు ఒక కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. దూరంగా మృత్యువు తెలియని కాలాన్ని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుంటూ వెళ్ళిపోతున్నాడురా శ్రీను.. అంటూ మొదలైంది. మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురు యాక్షన్ సీన్స్ చూపించారు. వారాహి గుడి, ఒక ఊరు నేపథ్యంలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో ముగ్గురు అన్నదమ్ములుగా నటించినట్టు, ఒకరి కోసం ఒకరు నిలబడినట్టు చూపించారు. చివర్లో శ్రీనివాస్ కి పూనకం వచ్చిన షాట్ చూపించారు. దీంతో ఈ ముగ్గురు హీరోలు కలిసి భారీ యాక్షన్ సినిమా తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
Also Read : Jacky Bhagnani : సినిమా షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ భర్తకు గాయాలు.. ఆ హీరోకు కూడా గాయాలు..