Balakrishna : బాలకృష్ణ సెంటిమెంట్.. ఆ కలర్ డ్రెస్ వేస్తే డేంజర్.. ఎందుకో తెలుసా? వేస్తే ఏమైందో తెలుసా?

డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో బాలయ్య ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Balakrishna : బాలకృష్ణ సెంటిమెంట్.. ఆ కలర్ డ్రెస్ వేస్తే డేంజర్.. ఎందుకో తెలుసా? వేస్తే ఏమైందో తెలుసా?

Do You Know About Balakrishna Sunday Sentiment Here Details

Updated On : January 20, 2025 / 3:57 PM IST

Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల హిట్స్ తో దూసుకుపోతున్నారు. తాజాగా సంక్రాతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాలో బాలయ్య ఒక్కడే మూడు వేరియేషన్స్ తో ఎమోషన్, యాక్షన్ తో ప్రేక్షకులను మెప్పించాడు.

డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో బాలయ్య ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. బాలకృష్ణ సెంటిమెంట్స్ బాగా ఫాలో అవుతారని తెలిసిందే. ఆయన రోజూ ఉదయమే లేచి పూజలు చేస్తారు, దేవుడ్ని బాగా నమ్ముతారు, ఏదైనా మొదలుపెట్టాలంటే ముహుర్తాలు చూసుకుంటారు, చేతికి పెద్ద పెద్ద ఉంగరాలు పెడతారు. అలాగే బాలయ్య తాను ఫాలో అయ్యే ఓ సెంటిమెంట్ గురించి ఇంటర్వ్యూలో చెప్పారు.

Also Read : Jacky Bhagnani : సినిమా షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ భర్తకు గాయాలు.. ఆ హీరోకు కూడా గాయాలు..

బాలకృష్ణ మాట్లాడుతూ.. నాది మూల నక్షత్రం. నేను ఆదివారం పూట బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోకూడదు. వేసుకుంటే ఏదో ఒకటి డేంజర్ జరుగుతుంది. ఓ సారి వేసుకుంటే ఏమవుతుంది అని ఊరికే ట్రై చేద్దాం అని వేసుకున్నాను. ఆదిత్య 369 షూటింగ్ జరిగేటప్పుడు ఓ రోజు ఆదివారం షూట్ చేస్తుంటే కావాలని బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్ళాను. ఆదివారం వద్దు అని నా మైండ్ చెప్తున్నా నేను వినకుండా వేసుకున్నాను. ఆ సినిమా నిర్మాత SP బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ షూట్ కి రారు. ఆ రోజు షూటింగ్ కి వస్తే నేను ఆయన కళ్ళ ముందే కింద పడ్డాను. నా నడుము విరిగింది. నా జాతకానికి వ్యతిరేకంగా వెళ్ళాను కాబట్టే అలా జరిగింది అని తెలిపారు.

దీంతో బాలయ్య ఆదివారం పూట బ్లాక్ డ్రెస్ అస్సలు వేసుకోరు అని తెలుస్తుంది. ఇలాంటి సెంటిమెంట్లు బాలయ్య చాలానే పాటిస్తారు. ఇక ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ఆల్రెడీ బాలయ్య అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన కొడుకు మోక్షజ్ఞతో కలిసి నటిస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా మూడు సినిమాలతో 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించి హ్యాట్రిక్ కొట్టి ఇప్పుడు డాకు మహారాజ్ తో మరో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు. మరో వైపు బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.

Also Read : RGV : 27 ఏళ్ళ తర్వాత ఆ సినిమా చూసి ఏడ్చిన ఆర్జీవీ.. నేను తప్పు చేశాను అంటూ ఎమోషనల్ ట్వీట్..