Director Padmavathi Malladi : ప్రభాస్ సినిమాకు పనిచేసి.. ఇప్పుడు డైరెక్టర్ గా సుకుమార్ కూతురితో సినిమా..

డైరెక్టర్ పద్మావతి మల్లాది మీడియాతో మాట్లాడుతూ గాంధీ తాత చెట్టు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Director Padmavathi Malladi : ప్రభాస్ సినిమాకు పనిచేసి.. ఇప్పుడు డైరెక్టర్ గా సుకుమార్ కూతురితో సినిమా..

Director Padmavathi Malladi Talks About Sukumar Daughter Gandhi Tatha Chettu Movie

Updated On : January 20, 2025 / 5:09 PM IST

Director Padmavathi Malladi : డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి మెయిన్ లీడ్ లో నటించిన గాంధీ తాత చెట్టు సినిమా జనవరి 24న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా పలు ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని అనేక అవార్డులు సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ బ్యానర్స్ పై తబితా సుకుమార్‌ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ పద్మావతి మల్లాది మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

డైరెక్టర్ పద్మావతి మల్లాది తన గురించి చెప్తూ.. పీజీ పూర్తి చేసిన తరువాత నేను రాసిన ఓ కథ తెలిసిన వాళ్ళ ద్వారా చంద్రశేఖర్‌ యేలేటి దగ్గరకు వెళ్లడంతో ఆయన చేసిన మనమంతా సినిమాకు రైటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసాను. ఆ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమాకు కూడా రచయితగా పనిచేశాను. అనంతరం మహానటి, అమ్ము, బృంద అనే సిరీస్ లకు పనిచేసాను. నా ఫ్రెండ్ ఒకరు మనిషికి చెట్టుకు లవ్ స్టోరీ రాస్తే బాగుంటుంది అని చెప్పడంతో ఈ కథ మొదలైంది అని తెలిపింది.

Also Read : Bhairavam Teaser : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్.. మల్టీస్టారర్.. ‘భైరవం’ టీజర్ చూశారా?

ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఒక అమ్మాయి అహింసవాదంతో ఓ ఊరిని, ఒక చెట్టును ఎలా కాపాడింది అనేదే కథ. ఇది కేవలం అవార్డ్‌ సినిమా కాదు. కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి. కామారెడ్డి దగ్గర చెరుకు తోట ఉన్న రంగంపేట అనే ఊరిలో ఈ సినిమా షూటింగ్ చేసాము. ఈ కథ 1947లో గాంధీ గారు, ఒక చెట్టు లింక్ తో మొదలవుతుంది. సినిమా 2000 సంవత్సరంలో జరిగే కథ. గాంధీ అనే అమ్మాయి, ఒక చెట్టు, ఒక తాత పాత్ర గురించి ఈ సినిమా కథ. అహింస గురించి ఈ సినిమాలో చెప్పాను. 25 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ చేసాము అని తెలిపింది.

సుకుమార్ కూతురు సుకృతి వేణి గురించి మాట్లాడుతూ.. నా కథలో అమ్మాయి ఇలా ఉండాలి అని ఒక డిజైన్ గీసుకున్నాను. అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రివ్యూ సమయంలో సుకృతిని చూసాం. నా పాత్రకు సుకృతి కరెక్ట్ గా సరిపోతుంది అనుకున్నాను. సుకుమార్ ద్వారా తబిత గారిని కలిసి సుకృతికి కథ చెప్పి ఒప్పించాము. గాంధీ పాత్రకు ఆమె పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యింది. గాంధీ పాత్ర కోసం సుకృతితో రెండు నెలలు వర్క్‌షాప్‌ చేశాం. అన్ని డైలాగ్స్ ముందే రిహార్సల్‌ చేసింది. సుకృతి ఈ సినిమాలో గుండు నిజంగా గీయించుకుంది. ప్రొస్తటిక్ మేకప్‌ వేద్దామనుకున్నా మా దగ్గర అంత బడ్జెట్‌ లేదు. ఈ కథలో అమ్మాయి పాత్ర చాలా ధైర్యం ఉన్న అమ్మాయి. సుకృతి కూడా గుండు గీయించుకోడానికి ఓకే చెప్పింది అని తెలిపారు.

Also Read : Balakrishna : బాలకృష్ణ సెంటిమెంట్.. ఆ కలర్ డ్రెస్ వేస్తే డేంజర్.. ఎందుకో తెలుసా? వేస్తే ఏమైందో తెలుసా?

సుకుమార్ ఈ సినిమాకు ఇచ్చిన సపోర్ట్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు సుకుమార్ సర్ సలహాలేమి ఇవ్వలేదు. నేను తీసే జానర్ కాదు కాబట్టి నువ్వు ఎలా అనుకుంటే అలా తీయి అని చెప్పారు. అవార్డ్స్‌ గెలిచిన తరువాత సినిమాను రిలీజ్‌ చేయాలనేది సుక్కు సర్ ఆలోచనే. ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాకు మంచి అప్లాజ్‌ వచ్చింది. దాంతో సినిమాకు మరింత గుర్తింపు వచ్చింది అని తెలిపారు.