Trinadha Rao Nakkina : పవన్, బాలయ్యలపై ధమాకా దర్శకుడు కామెంట్స్..

'సినిమా చూపిస్తా మావ' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు 'త్రినాథ రావ్ నక్కిన'. ఈ డైరెక్టర్ రీసెంట్ గా తెరకెక్కించిన చిత్రం రవితేజ నటించిన 'ధమాకా'. ఈ మూవీ సూపర్ హిట్టు కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు దర్శకుడు. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్, బాలయ్యలపై ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Trinadha Rao Nakkina : పవన్, బాలయ్యలపై ధమాకా దర్శకుడు కామెంట్స్..

Trinadha Rao Nakkina about balayya and pawan

Updated On : January 1, 2023 / 5:57 PM IST

Trinadha Rao Nakkina : ‘సినిమా చూపిస్తా మావ’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ‘త్రినాథ రావ్ నక్కిన’. ఈ డైరెక్టర్ రీసెంట్ గా తెరకెక్కించిన చిత్రం రవితేజ నటించిన ‘ధమాకా’. ఈ మూవీ సూపర్ హిట్టు కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు దర్శకుడు. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్, బాలయ్యలపై ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Dhamaka: రవితేజ కెరీర్‌లోనే అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ధమాకా!

బాలకృష్ణ గారితో మీరు నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అని ప్రశ్నించగా.. అవన్నీ అవాస్తం అని కొట్టిపారేశాడు. ఆ తరువాత బాలయ్య అన్‌స్టాపబుల్ గురించి దర్శకుడు మాట్లాడుతూ.. “అన్‌స్టాపబుల్‌తో బాలయ్య ఇరగొట్టేస్తున్నాడు. అది చూస్తుంటే ఎక్కడి లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ షోకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనేది ఇంకా కిక్ ఇచ్చే న్యూస్.

అయితే నాకు అర్ధంకాని విషయం ఏంటంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్నాడు కదా? ముక్కుసూటిగా ప్రశ్నలు అడిగే బాలయ్య, పవన్ ని ఏ ప్రశ్నలు అడగబోతున్నాడు అనేది ఆశక్తి రేకిస్తుంది. వీరిద్దరికి ఎలా సింక్ అవ్వుది అనేది చూడాలి అనిపిస్తుంది” అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఈ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చాలా ఆశక్తి నెలకుంది.