Tunisha Sharma : శ్రద్ధావాకర్ హత్య వల్ల తునిషాకి బ్రేకప్ చెప్పా.. ప్రియుడు షీజాన్‌!

బాలీవుడ్ సినిమా అండ్ సీరియల్ యాక్టర్ ‘తునీషా శర్మ’ సూసైడ్ చేసుకోవడం హిందీ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. తునీషాకి బ్రేకప్ చెప్పడం ఇష్టం లేకున్నా షీజాన్ బలవంతంగా ఆమె నుంచి విడిపోవడానికి ప్రయత్నించడమే ఆమె సూసైడికి కారణమని.. పోలిసుల విచారణలో తెలియజేశాడు ప్రియుడు షీజాన్. అయితే అతడు బ్రేకప్ చెప్పడానికి గల కారణాలు కూడా పోలీసులకు వెల్లడించాడు షీజాన్.

Tunisha Sharma : శ్రద్ధావాకర్ హత్య వల్ల తునిషాకి బ్రేకప్ చెప్పా.. ప్రియుడు షీజాన్‌!

Tunisha Sharma suicide due to shraddha walker's death

Updated On : December 27, 2022 / 9:24 AM IST

Tunisha Sharma : బాలీవుడ్ సినిమా అండ్ సీరియల్ యాక్టర్ ‘తునీషా శర్మ’ సూసైడ్ చేసుకోవడం హిందీ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. డిసెంబర్ 24న ఒక సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న తునిషా.. అదే సెట్ మేకప్ రూమ్‌లో ఉరువేసుకొని కనపడడం అందర్నీ షాక్ గురి చేసింది. అప్పటి వరకు షూటింగ్‌ సెట్‌లో అల్లరి చేస్తూ ఉన్న తునిషా ఉరితాడుకు వేలాడుతూ చూసి తోటి నటీనటులతో సహా సెట్ లోని వారంతా దిగ్బ్రాంతికి లోనయ్యారు.

Tunisha Sharma : ఆత్మహత్య చేసుకున్న తునీషా ప్రెగ్నెంటా?

ఇక ఆమె మరణాన్ని పలు కోణాల్లో విచారించిన పోలీసులు.. ప్రేమ విఫలం అవ్వడం వల్లే ఆత్మహత్య చేసుకుంది అంటూ నిర్దారించారు. గత కోనేళ్ళుగా తునిషా తన కో-యాక్టర్ ‘షీజాన్ మహమ్మద్ ఖాన్’తో ప్రేమలో ఉంది. తునీషాకి బ్రేకప్ చెప్పడం ఇష్టం లేకున్నా షీజాన్ బలవంతంగా ఆమె నుంచి విడిపోవడానికి ప్రయత్నించడమే ఆమె సూసైడికి కారణమని.. పోలిసుల విచారణలో తెలియజేశాడు ప్రియుడు షీజాన్.

అయితే అతడు బ్రేకప్ చెప్పడానికి గల కారణాలు కూడా పోలీసులకు వెల్లడించాడు షీజాన్. ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్య కేసు వల్లే తాను బ్రేకప్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేశాడు. తునిషా, షీజాన్ మధ్య ఎనిమిదేళ్ల వయసు గ్యాప్ ఉండడం, పైగా కులాలు కూడా వేరు అవ్వడంతో.. భవిష్యత్తులో సమస్యలు తప్పవు అనే బ్రేకప్ చెప్పినట్లు వెల్లడించాడు. కాగా తునీషా శర్మ వయసు 20 ఏళ్ళు, ప్రియుడు షీజాన్ వయసు 28 ఏళ్ళు.