Actress Shruti Das : డైరెక్టర్‌ను పెళ్లిచేసుకున్న త్రినయని సీరియల్ నటి
గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ప్రముఖ బెంగాళీ బుల్లితెర నటి శృతి దాస్(Shruti Das), దర్శకుడు స్వర్ణేందు సమద్దర్(Swarnendu Samaddar) పెళ్లిపీటలు ఎక్కారు. వివాహ బంధంలో ఒక్కటి అయ్యారు.

Shruti Das married Swarnendu Samaddar
Actress Shruti Das-Swarnendu Samaddar : గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ప్రముఖ బెంగాళీ బుల్లితెర నటి శృతి దాస్(Shruti Das), దర్శకుడు స్వర్ణేందు సమద్దర్(Swarnendu Samaddar) పెళ్లిపీటలు ఎక్కారు. వివాహ బంధంలో ఒక్కటి అయ్యారు. వీరిద్దరు ఆదివారం (జూలై 9న) రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఈ విషయాన్ని కొత్త పెళ్లి కూతురు శృతి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మిస్ టు మిసెస్ అంటూ రాసుకొచ్చింది.
View this post on Instagram
‘మా ఇద్దరి కల నిజమైంది. కొద్ది కాలంగా ఇద్దరం కలిసే జీవిస్తున్నాం. సరైన సమయం చూసుకుని వివాహా బంధంతో ఒక్కటి అయ్యాం. అయితే.. మా మ్యారేజ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని అనుకోవడం లేదని’ చెప్పుకొచ్చింది. తమ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Shruti Das married Swarnendu Samaddar
శృతి ‘త్రినయని’ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘దేశ్ మతి, ‘రంగా బావు’ వంటి సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శృతి దాస్, స్వర్ణేందు సమద్దర్ లు త్రినయని సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ పరిచయం స్నేహాంగా మారి క్రమంగా ప్రేమకు దారి తీసింది. ఇప్పుడు పెళ్లితో వీరిద్దరు ఒక్కటి అయ్యారు. కొత్త జంటకు అభిమానులు, తోటి నటీ, నటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram