GST దాడులపై సుమ, అనసూయ రెస్పాండ్

  • Publish Date - December 23, 2019 / 03:30 PM IST

బుల్లితెర నటులపై GST దాడులు జరుగుతున్నాయనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో వారు రెస్పాండ్ కావాల్సి వస్తోంది. ఇవన్నీ రూమర్స్ అంటూ ఖండిస్తున్నారు. సుమ, అనుసూయలు ఇదే విధంగా స్పందించారు. ఇన్ స్ట్రా గ్రామ్ వేదికగా సుమ ఓ వీడియోను రిలీజ్ చేయగా..అనసూయ కామెంట్స్ ని పోస్టు చేశారు. ఎలాంటి నిజం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాంప్ట్ గా జీఎస్టీ చెల్లిస్తున్నానని, రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని సుమ వెల్లడించింది.

 

పది మంది నోళ్లలో నాని అదే నిజం అవుతుంది కాబట్టే స్పందించాల్సి వస్తోందన్నారు. తప్పుడు వార్తలు సృష్టించడానికి కొందరు ఇష్టపడుతారని, వాస్తవాలు తెలుసుకోకుండా..మీడియా సంస్థలు కూడా వాటిని ప్రసారం చేయకూడదని సూచించారు. ఏదైనా వార్తను ప్రచురించే ముందు..వాటిని ఒక్కసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు సుమ. 

Read More : ఆరాధ్య అభినయం : మనవరాలి స్పీచ్‌కు మురిసిన బిగ్ బి
తన ఇంటిపై కానీ తన చెందిన స్థలాలపై ఎలాంటి సోదాలు జరగలేదని చెప్పుకొచ్చింది అనసూయ. వీడియో అనేది సమాచారం ఇవ్వాలి..కానీ ఊహాజనితమైన కథాలు, వ్యక్తిగత అభిప్రాయాలకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు. మంచి పేరు, గౌరవం తెచ్చుకోవడానికి తాము చాలా కష్టపడ్డామన్నారు. మీడియా చాలా శక్తివంతమైందని, సమాజానికి మంచి చేయడంపై దృష్టి సారించాలన్నారు. అనవసరంగా ఇబ్బందులకు గురి చేయవద్దని వెల్లడించిన అనసూయ…ఏదైనా వార్తను ప్రసారం చేసే ముందు..అందులోని వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు. 

ట్రెండింగ్ వార్తలు