Two Souls : ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్.. మరో చిన్న సినిమా ‘టూ సోల్స్’.. ఏప్రిల్ 21న విడుదల

పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన టూ సోల్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 21వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్

Two Souls : ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్.. మరో చిన్న సినిమా ‘టూ సోల్స్’.. ఏప్రిల్ 21న విడుదల

Two Souls Movie Releasing on April 21st

Updated On : April 20, 2023 / 2:08 PM IST

Two Souls :  కథలో కొత్తదనం ఉండాలే గానీ ఆ సినిమా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎలాంటి భారీ కాస్టింగ్ లేకుండానే కథనాన్ని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా మలిచి ఎంతోమంది కొత్త దర్శకులు సక్సెస్ అయ్యారు. అదే బాటలో ఇప్పుడు యువ దర్శకుడు శ్రావణ్ ఓ సరికొత్త ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టూ సోల్స్ (Two Souls) అనే డిఫరెంట్ టైటిల్ తో తన దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమాను విడుదల చేయబోతున్నారు.

పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 21వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టు సోల్స్ టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వెండితెరపై ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ చూడొచ్చు అనే ఫీలింగ్స్ తీసుకొచ్చాయి.

Two Souls Movie Releasing on April 21st

 

ఈ సినిమాలో త్రినాథ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లుగా నటించారు. రవితేజ మహదాస్యం, మౌమిక రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మనకు ఎదురయ్యే ఏ పరిచయం కూడా యాదృచ్ఛికం కాదు అనే కథా నేపథ్యంతో గతంలో ఎన్నడూ చూడని ఆసక్తికర ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందించారని టీజర్, ట్రైలర్ స్పష్టం చేశాయి.

Pushpa : సినిమాలో అలా చూపించడం బాధాకరం.. పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐజి..

రెండు ఆత్మల మధ్య జరిగే ప్రయాణాన్ని సగటు ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ అనిపించేలా తెరకెక్కించారని ట్రైలర్ ద్వారా తెలిసింది. పలు అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలోని డైలాగ్స్ యువ హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రతిక్ అబ్యంకర్ అండ్ ఆనంద్ నంబియార్ సంగీతం అందించగా.. శశాంక్ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. టు సోల్స్ మూవీ సక్సెస్ పై చిత్రయూనిట్ నమ్మకంగా ఉంది.