Ram Vs Ravan
Ram Vs Ravan: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో సినిమా థియేటర్లు, ఓటీటీలని బయటకు వస్తుంటే ఒక్కో సినిమా పట్టాలెక్కుతోంది. ఇందులో చిన్న సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. భారీ సినిమాలు బ్యాలెన్స్ పూర్తిచేసుకొని పనిలో ఉండగా కొత్త వారితో మొదలయ్యే సినిమాలు ఒక్కొకటి కొబ్బరి కాయలు కొట్టేస్తున్నారు. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదుగా ‘రామ్ వర్సెస్ రావణ్’ అనే మరో సినిమా షూటింగ్ ప్రారంభం మొదలైంది. సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సప్తగిరి కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Shyam Singha Roy: నాని జై అంటున్న ఓటీటీ.. నెట్ ఫ్లిక్స్‌కు శ్యామ్?
రాజమౌళి, వైవీఎస్ చౌదరి, ఎం శంకర్ వంటి ప్రముఖ దర్శకుల వద్ద పనిచేసిన కె శుక్రన్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్న ఈ సినిమాను షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో మొదలైన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు కె.శుక్రన్.. మిత్రుల సమక్షంలో సినిమా ప్రారంభోత్సవం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Evaru Meelo Koteeswarulu: హీరోలంతా ఒక్కటే.. అందరినీ గేదర్ చేస్తున్న తారక్!
ఇక రామ్ వర్సెస్ రావణ్ విషయానికొస్తే…ఇదొక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు అనేది సినిమాలో చూపిస్తున్నామని దర్శకుడు తెలిపారు. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కథలో కలిసి ఉండనుండగా కథ మీద పూర్తి నమ్మకంతో సినిమా ప్రారంభించామని. సినిమాటోగ్రాఫర్ రాజామతి ఈ కథ నచ్చి ముందుకు వచ్చారని తెలిపారు. హీరో సొలమన్ జడ్సన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుందని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వీలైనంత త్వరగా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
Bigg Boss 5: ఎలిమినేషన్‌లో ఐదుగురు.. లహరికి డేంజర్ తప్పదా?
మరో హీరో రాజ్ బాలా మాట్లాడుతూ.. పల్లెటూరిలోని సెన్సిటివ్ ఇష్యూస్ ను మా డైరెక్టర్ గారు కథలో చూపిస్తున్నారని.. సీరియస్ ఇష్యూస్ కథలో ఉన్నా.. అవన్నీ ఎంటర్ టైనింగ్ గానే దర్శకుడు తెరకెక్కిస్తున్నారని.. మంచి ప్లానింగ్ తో సినిమాను కంప్లీట్ చేయబోతున్నామని చెప్పారు. హీరోయిన్ మనో చిత్ర మాట్లాడుతూ.. ఈ టీమ్ తో ట్రావెల్ అవుతుంటే ఒక సూపర్ హిట్ సినిమా చేసేందుకు గట్టి నమ్మకంతో ఉన్నట్లు అర్థమయ్యింది. నా వంతు ఎఫర్ట్స్ పెట్టి, రామ్ వర్సెస్ రావణ్ సినిమా మంచి హిట్ అయ్యేలా ప్రయత్నిస్తానని చెప్పారు.