Shyam Singha Roy: నాని జై అంటున్న ఓటీటీ.. నెట్ ఫ్లిక్స్‌కు శ్యామ్?

ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలు సక్సెస్ కాకపోయినా.. ఆడియన్స్ రెస్పాన్స్ అంత బాగా లేకపోయినా.. నాని మాత్రం ఓటీటీకి హాట్ ఫేవరెట్ అయిపోయాడు. హిట్, ఫ్లాప్ తో సంబందం లేకుండా..

Shyam Singha Roy: నాని జై అంటున్న ఓటీటీ.. నెట్ ఫ్లిక్స్‌కు శ్యామ్?

Shyam Singha Roy

Shyam Singha Roy: ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలు సక్సెస్ కాకపోయినా.. ఆడియన్స్ రెస్పాన్స్ అంత బాగా లేకపోయినా.. నాని మాత్రం ఓటీటీకి హాట్ ఫేవరెట్ అయిపోయాడు. హిట్, ఫ్లాప్ తో సంబందం లేకుండా, రిజల్ట్ ని ఏమాత్రం పట్టించుకోకుండా.. నాని జై అంటున్నాయి ఓటీటీలు. ఆల్రెడీ రెండు సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేసిన నాని రిలీజ్ కు రెడీ అవుతున్న మూడో సినిమాకి కూడా బాగానే రాబట్టుకుంటున్నాడు.

Big Boss 5: ప్రేమ కథలు, బ్రేకప్ స్టోరీలు.. ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్

నాని సినిమా ఎలా ఉన్నా.. ఓటీటీలో మాంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ ‘వి’ సినిమాతో పాటు ఈ సంవత్సరం ‘టక్ జగదీష్’ సినిమాల్ని ఓటీటీలోనే రిలీజ్ చేశాడు. రెండు సినిమాలను ఓటీటీలో మంచి ప్యాకేజ్ కి సినిమాల్ని రిలీజ్ చేసిన నాని.. ముచ్చటగా మూడో సినిమాకి కూడా బాగానే డీల్ కుదుర్చుకున్నాడు.

Bigg Boss 5: ఎలిమినేషన్‌లో ఐదుగురు.. లహరికి డేంజర్ తప్పదా?

నాని ఓటీటీకి హాట్ ఫేవరెట్ అయ్యారు కాబట్టే .. తన మూడో సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. రాహుల్ సాంస్కృత్యన్ తో నాని చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ మాంచి రేట్ కి ఇప్పటికే లాక్ చేసుకుంది. సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది.

Evaru Meelo Koteeswarulu: హీరోలంతా ఒక్కటే.. అందరినీ గేదర్ చేస్తున్న తారక్!

నిజానికి నాని ఓటీటీలో లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన వి సినిమా కానీ, ఈ సంవత్సరం వినాయకచవితికి రిలీజ్ చేసిన టక్ జగదీష్ కానీ అంతగా ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. అయినా సరే.. ఓటీటీలు మాత్రం నానీ సినిమాలే కావాలనుకుంటున్నాయి. మినిమం గ్యారంటీ హీరోగా మాంచి టాక్ ఉన్న నానికి రిజల్ట్ తో సంబందం లేకుండా ఓటీటీలు వెంటపడి మరీ మంచి రేట్ ఇచ్చి సినిమాల రైట్స్ సొంతం చేసుకుంటున్నారు.