Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ ఊసే లేదు.. కానీ ఓటీటీ రైట్స్ కి భారీ డిమాండ్.. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లోనే హయ్యెస్ట్
టైసన్ నాయుడు(Tyson Naidu) ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న జియో హాట్ స్టార్.
Tyson Naidu movie OTT rights acquired by Jio Hotstar
- టైసన్ నాయుడు ఓటీటీ డీల్ షాకింగ్ ప్రైస్
- రూ.20 కోట్లు ఆఫర్ చేసిన జియో హాట్ స్టార్
- బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓటీటీ డీల్
Tyson Naidu: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గత కొంతకాలంగా సరైన విజయం లేక ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కానీ, గత ఏడాది విడుదలైన ‘కిష్కిందాపురి’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఆయన, తన సక్సెస్ ట్రాక్‌ను అలాగే కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘టైసన్ నాయుడు’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Prasanth Varma: PVCU లోకి కుమారస్వామి ఎంట్రీ.. సముద్రఖని దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్!
నిజానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం కావడంతో, సరైన అప్డేట్స్ లేక ప్రేక్షకులు ఈ ప్రాజెక్ట్ గురించి దాదాపుగా మర్చిపోయారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే, థియేట్రికల్ రన్ కంటే ముందే ఈ సినిమా డిజిటల్ బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం, ఇది ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్ స్టార్’ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.20 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లోనే ఓటీటీ పరంగా ఇది అత్యధిక ధర కావడం విశేషం. సినిమాపై ఉన్న నమ్మకం, సాగర్ కె చంద్ర మేకింగ్ స్టైల్ వల్లే ఇంతటి భారీ డీల్ కుదిరినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో ‘టైసన్ నాయుడు(Tyson Naidu)’ చిత్రబృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది. అలాగే సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఇక త్వరలోనే సినిమా ప్రమోషన్లను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి కిష్కిందాపురితో వచ్చిన సక్సెస్ ను బెల్లంకొండ శ్రీనివాస్ కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.
