Indian 3 : సీక్వెల్ కూడా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే మూడో పార్ట్ గురించి హింట్.. ఉదయనిధి స్టాలిన్‌ కామెంట్స్!

ఇండియన్ 2 రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయలేదు. అప్పుడే ఇండియన్ 3 ఉండబోతుందంటూ అంటూ నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ కామెంట్స్ చేశారు.

Indian 3 : సీక్వెల్ కూడా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే మూడో పార్ట్ గురించి హింట్.. ఉదయనిధి స్టాలిన్‌ కామెంట్స్!

Udhayanidhi Stalin says Kamal Haasan Indian 3 will happen

Kamal Haasan – Indian 3 : లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 1996 లో వచ్చిన సినిమా ‘భారతీయుడు’. అప్పటిలో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు ఆ చిత్రానికి దర్శకుడు సీక్వెల్ ని తీసుకు వస్తున్నాడు. 2019 లోనే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం అనేక కారణాలు వల్ల లేటు అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. కమల్ హాసన్ కి సంబంధించిన షూటింగ్ అయితే పూర్తి అయ్యినట్లు సమాచారం.

Yatra 2 : ఆ స్పెష‌ల్ డే రోజు అప్డేట్.. యాత్ర 2 గురించి హింట్ ఇచ్చిన దర్శకుడు..!

కాగా ఈ చిత్రాన్ని తమిళ్ హీరో మరియు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండియన్ 2 కోసం చిత్రీకరించిన కొన్ని సీన్స్ ని ఇప్పుడు ఉపయోగించడం లేదు. వాటితో ఇండియన్ 3 తీసే ఆలోచనలో ఉన్నారు శంకర్ అండ్ కమల్. అయితే దాని పై ఇంకా పూర్తి నిర్ధారణకు రాలేదు. ప్రస్తుతం ఇండియన్ 2 అవుట్ పుట్ ని చూసి అయితే ఇద్దరు సంతోషంగా ఉన్నారు” అని తెలియజేశారు.

Sushant Singh Rajput : సుశాంత్‌ సింగ్‌ కేసులో పురోగతి.. బలమైన సాక్ష్యాలు ఉన్నాయని.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు!

ఇక ఈ వ్యాఖ్యలతో మూడో పార్ట్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే అది ఈ సీక్వెల్ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ ఇండియన్ 2 బ్లాక్ బస్టర్ అయితే మూడో పార్ట్ షురూ. కాగా ఈ సీక్వెల్ ని ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది సంక్రాంతిలో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బాబీ సింహా, సముద్రఖని, ఎస్ జె సూర్య వంటి స్టార్స్ నటిస్తున్నారు.