Udhayanidhi Stalin : బాలీవుడ్ అన్ని భాషల ఇండస్ట్రీలను తొక్కేస్తుంది.. ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

Udhayanidhi Stalin sensational comments on Bollywood
Udhayanidhi Stalin : బాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. మనోరమ డెయిరీ గ్రూప్ నిర్వహించిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమిళనాడు డిప్యూటీ సీఎం.. దక్షిణాదిలో ఉన్న సినీ ఇండస్ట్రీ అభివృద్ధి చెందినప్పటికీ అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలను తొక్కేసి కేవలం హిందీ సినిమాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది భారతీయ సినీ ఇండస్ట్రీకి అస్సలు మంచిది కాదని మండి పడ్డారు.
Also Read : Samantha : ఐటమ్ సాంగ్స్ చెయ్యను.. సింగిల్‌గా కూడా ఉండను.. సమంత సంచలన వ్యాఖ్యలు..
ఉత్తరాదిలో అయితే ఉత్తర భారతదేశంలో మరాఠీ, భోజ్‌పురి, బీహారీ, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారని.. అలాగే ఉత్తరాదిలో పలు రాష్ట్రాలకి కనీసం సొంత సినీ ఇండస్ట్రీ కూడా లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఆ రాష్ట్రాలు తమ సొంత భాషను కాపాడుకోకపోతే ఆ స్థానంలోకి హిందీ వచ్చేస్తుందని అన్నారు. అంతేకాకుండా తాము హిందీకి వ్యతిరేకం కాదని, కానీ తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం అయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.