Modi – Mukundan : 20 ఏళ్ళ కల.. మోదీతో అలా మాట్లాడాలని.. ఉన్ని ముకుందన్ పోస్ట్ వైరల్!

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మోదీతో అలా మాట్లాడాలనే తన 20 ఏళ్ళ కలని నెరవేర్చుకున్నాడు. ఇంతకీ ఎలా మాట్లాడాలని?

Modi – Mukundan : 20 ఏళ్ళ కల.. మోదీతో అలా మాట్లాడాలని.. ఉన్ని ముకుందన్ పోస్ట్ వైరల్!

Unni Mukundan emotional post on meeting with Narendra Modi

Updated On : April 25, 2023 / 4:58 PM IST

Modi – Mukundan : మలయాళ ఉన్ని ముకుందన్.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఆ తరువాత భాగమతి, ఖిలాడీ, యశోద వంటి సినిమాలో కూడా నటించాడు. తాజాగా మలయాళ సూపర్ హిట్ సినిమా మాలికాపురం (Malikappuram) తో టాలీవుడ్ ఆడియన్స్ ని అలరించాడు. కాగా ఈ హీరో ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. మోదీతో దాదాపు 45 నిముషాలు పాటు ఉన్ని ముకుందన్ కలిసి వ్యక్తిగతంగా మాట్లాడాడు. ముకుందన్ మలయాళ నటుడు అయినప్పటికీ అతని బాల్యం అంత గుజరాత్ అహ్మదాబాద్ లోనే సాగింది. దీంతో గుజరాతీ అయిన మోదీని ముకుందన్ చిన్ననాటి నుంచి చూస్తూ ఎదిగాడు.

Tamannaah : ముంబై విధుల్లో ప్రియుడితో చక్కర్లు కొడుతున్న తమన్నా..

అయితే జీవితంలో ఒక్కసారైనా మోదీని కలిసి గుజరాతీ భాషలో మాట్లాడాలని తనకి 14 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి ముకుందన్ కలగానే వాడట. తన 20 ఏళ్ళ కలని ఇప్పుడు నెరవేర్చుకున్నారు. ఇటీవల కేరళ పర్యటనకు వచ్చిన మోదీని ముకుందన్ పర్సనల్ కలిశాడు. ఇక మోదీతో మాట్లాడని అనుభూతుని పంచుకుంటూ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

Shahrukh Khan : కాశ్మీర్ లో షారుఖ్ ఖాన్ డంకీ.. వీడియో వైరల్!

“నా అకౌంట్ లో ఇదే చాలా పవర్ ఫుల్ పోస్ట్. 14 ఏళ్ళ వయసు నుంచి మిమ్మల్ని కలవాలనే కోరిక ఇవాళ నిజమైంది. మీరు నన్ను గుజరాతీ భాషలో పలకరించడం నన్ను షాక్ కి గురి చేసింది. మిమ్మల్ని కలిసి మీతో గుజరాతులో మాట్లాడాలనేది నా జీవితంలోని పెద్ద కల. అది ఇవాళ నెరవేరింది. మీతో మాట్లాడిన ఈ 45 నిముషాలు నా జీవితంలోనే మర్చిపోలేనివి. మీరు చెప్పిన ప్రతి మాట, సలహా ఆచరణలో పెట్టడంతోపాటు అమలు చేస్తాను” అంటూ రాసుకొచ్చాడు. అలాగే మోదీతో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.