Unstoppable season 4 first episode shooting complete
Unstoppable Season 4 : ఆహా ఓటీటీలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజన్‌కు సంబంధించిన ప్రొమోను ఇప్పటికే విడుదల చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 4 పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా షోను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.
తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తరువాత చోటు చేసుకున్న పలు అంశాలను చంద్రబాబు పంచుకున్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదండోయ్.. బాలకృష్ణతో కలిసి చంద్రబాబు పలు టాస్క్‌లు కూడా ఆడారు. ఇక చంద్రబాబుతో బాలయ్య కూరగాయలను కొనిపించారు. ఆ తరువాత బాలకృష్ణ ని ఒక రేంజు లో ఆడుకున్న ఆడుకున్నారు చంద్రబాబు. బాలయ్యతో బోత్ ఆర్ నాట్ ది సేమ్ అనే డైలాగ్‌ను ముఖ్యమంత్రి చెప్పారట. మొత్తానికి ఈ షో బావ బామర్దిల మధ్య సరదాగా సాగినట్లుగా సమాచారం.
ఇక ఈ మొదటి ఎపిసోడ్ ఆహాలో అక్టోబర్ 25న రాత్రి 8.30గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.