Bigg Boss 8 : బిగ్‌బాస్ హౌస్ మేట్స్‌పై మీమ్స్‌.. మ‌ణికంఠ మీమ్ చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. ఛ‌త్ర‌ప‌తి బీజీఎంతో..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఏడో వారం ఆఖ‌రికి వ‌చ్చేసింది.

Bigg Boss 8 : బిగ్‌బాస్ హౌస్ మేట్స్‌పై మీమ్స్‌.. మ‌ణికంఠ మీమ్ చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. ఛ‌త్ర‌ప‌తి బీజీఎంతో..

Bigg Boss Telugu 8 Day 49 Promo 3 Hilarious Fan Memes

Updated On : October 20, 2024 / 7:38 PM IST

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఏడో వారం ఆఖ‌రికి వ‌చ్చేసింది. ఆదివారం రోజు ఎవ‌రు ఎమిలినేట్ కానున్నారు అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలు వ‌చ్చేశాయి. ఎప్ప‌టిలాగానే ఆదివారం ఫ‌న్ డే అంటూ హౌస్‌మేట్స్‌తో నాగార్జున కొన్ని ఫ‌న్నీ గేమ్స్ ఆడించారు.

నువ్వు ఊరుకోమ్మా.. అన్నింటికీ తుత్తుత్తు అంటావ్‌.. అన్న డైలాగ్‌ను నిఖిల్.. ప్రేరణకు అంకితం చేశాడు. ఇక వాడినలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా.. అన్న డైలాగ్‌ను మణికి హ‌రితేజ అంకితం ఇచ్చింది. నాగార్జున కూడా క‌రెక్ట్ అంటూ స‌మాధానం ఇచ్చారు. ఎవ‌రికి చూపించినా వీడు మార‌డ‌మ్మా.. అలాగే ఉంటాడు అని నాగ్ అన్నారు.

Mechanic Rocky Trailer : విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైల‌ర్‌.. కామెడీతో పాటు యాక్ష‌న్ అదిరిపోయిందిగా

ఈ గేమ్ త‌రువాత హౌస్‌మేట్స్‌కు సంబంధించిన మీమ్స్ ను చూపించారు. ఇందులో మ‌ణికంఠ మీమ్ వైర‌ల్‌గా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీస్‌ని ఆపే ప‌వ‌ర్ కంటెస్టంట్ల‌కు ఉంద‌ని బిగ్‌బాస్ చెప్ప‌గా.. డ‌ల్‌గా ఉన్న మ‌ణికంఠ ఆవేశంగా పైకి లేస్తాడు. ఆ త‌రువాత‌ తొలి గేమ్‌లోనే ఓడిపోయి మిగిలిన గేమ్స్‌కు అన‌ర్హుడిగా మార‌డంతో.. నీకు వ‌చ్చిన క‌ష్టం ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దు రా అనే చ‌త్ర‌ఫ‌తి బీజీఎంతో వేశారు. ఇది చాలా హిలేరియ‌స్‌గా ఉంది.