Unstoppable Show Chandrababu Naidu comments on meeting with pawan kalyan
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలయ్యింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రాజకీయాలు, ఫ్యామిలీ, జైలు జీవితం, పవన్ కళ్యాణ్‌తో మీటింగ్ వంటి ఎన్నో అంశాల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా అరెస్ట్ అయి జైలో ఉన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆయన్ని కలవడానికి వెళ్లారు. ఆయన్ని కలిసిన తరువాత పవన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
కట్ చేస్తే.. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఆ మీటింగ్‌లో ఏం మాట్లాడారు అని చంద్రబాబుని బాలయ్య ప్రశ్నించారు.
Jani Master : మనిషి అనేవాడు జైలుకు పోవద్దు.. రెండు రోజుల వరకు ఎవ్వరిని కలవను!
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ వచ్చి నన్ను కలిశారు. పవన్‌తో నేను 2 నిమిషాలు మాట్లాడాను. ధైర్యంగా ఉన్నారా సార్ అని పవన్ అడిగారు. నా జీవితంలో ఎప్పుడు అధైర్యం ఉండదు. భయపడను, మీరు కూడా ధైర్యంగా ఉండండి అని అన్నాను. రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు అన్ని చూసిన తరువాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తానని పవన్ చెప్పారు.
అప్పుడు నేనే ముందు అన్నాను. ఓ సారి ఆలోచించండి. అందరం కలిసి పోటీ చేద్దామని పవన్‌తో అన్నాను. ఆయన కూడా ఆలోచించి ఓకే అన్నాడు. బీజేపీకి కూడా నచ్చజెప్పి కూటమిలోకి తీసుకువస్తానని చెప్పాడు అని చంద్రబాబు అన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లి కూటమి ప్రకటన చేసినట్లుగా చంద్రబాబు చెప్పారు. అదే తమ విజయానికి నాంది అని అన్నారు.
CM Chandrababu : చనిపోతే ఒక్క క్షణం.. జైలులో సందేహంగా కొన్ని సంఘటనలు జరిగాయి.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..