Jani Master : మనిషి అనేవాడు జైలుకు పోవద్దు.. రెండు రోజుల వరకు ఎవ్వరిని కలవను!
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదల అయ్యారు.

Jani Master Comments After reached home
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ బయటకు వచ్చారు. 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు.
జానీ మాస్టర్ ఇంటికి చేరుకున్నారు. ఓ డైరెక్టర్, ఇద్దరు కొరియోగ్రాఫర్స్‌తో ఆయన సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. ఇంకా జైలో ఉన్నట్లే ఉందని జానీ మాస్టర్ అన్నారు. ఆ ఫుడ్ తిన్నలేక పోయానని, మనిషి అనేవాడు జైలుకు పొవ్వొదు, బయట కంటే జైల్లో నరకం ఉంటుందని చెప్పారు.
ఇలా ఎలా జరిగిందో ఇప్పటికీ అర్దం అవ్వట్లేదు. ఇంకా రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తా. రెండూ రోజుల వరకు ఎవరితో మాట్లాడను. మీడియా ముందుకు ఇప్పట్లో రాను. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తా అని జానీ మాస్టర్ చెప్పినట్లుగా తెలుస్తోంది