Bheemla Nayak : రిలాక్స్ అవుతున్న ‘భీమ్లా నాయక్’.. డానియెల్ శేఖర్.. లుక్ అదిరిందిగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ న్యూ స్టిల్ చూశారా..

Bheemla Nayak : రిలాక్స్ అవుతున్న ‘భీమ్లా నాయక్’.. డానియెల్ శేఖర్.. లుక్ అదిరిందిగా!

Rana Pawan

Updated On : October 21, 2021 / 3:40 PM IST

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులో ‘భీమ్లా నాయక్’ గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఈ సినిమా కూడా ఒకటి.

Rohit Damodaran : డైరెక్టర్ శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు

ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు పాటలు, పవన్, రానా ఇంట్రడక్షన్ వీడియోలకు రెస్పాన్స్ ఏ రేంజ్‌లో వచ్చిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్‌కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంది.

25 Years Of PAWANISM : పాతికేళ్ల పవనిజమ్

గురువారం ‘భీమ్లా నాయక్’ నుండి సాలిడ్ స్టిల్ ఒకటి వదిలారు మేకర్స్.. పవన్ నులకమంచం మీద, రానా ఎద్దులబండి మీద పడుకుని సేద తీరుతున్న పిక్ రిలీజ్ చెయ్యగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పవన్ ‘భీమ్లా నాయక్’ గా, రానా ‘డానియెల్ శేఖర్’ గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.