Anushpala: ఉపాసన చెల్లెలు పెళ్లి.. కాబోయే భర్త ఎవరంటే?
మెగా కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల చెల్లెలు అనుష్పాల త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. అథ్లెట్ అర్మన్ ఇబ్రహీంతో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె అతడితో త్వరలోనే ఏడడుగులు వేయనుంది.

Upasan Sister
Upasana Sister Anushpala: మెగా కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెల చెల్లెలు అనుష్పాల త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. అథ్లెట్ అర్మన్ ఇబ్రహీంతో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె అతడితో త్వరలోనే ఏడడుగులు వేయనుంది. ఈ మేరకు వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అతడితో కలిసి అనుష్పాల దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన కొనిదెల.
ఉపాసన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘నా డార్లింగ్స్‌కు అభినందనలు’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై మెగా అభిమానులతో పాటు కాజల్, తమన్నా వంటి పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాజీ ఇండియన్ ఎఫ్-3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం తనయుడే అర్మన్ ఇబ్రహీం.
కారు రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇక అనుష్పాల విషయానికొస్తే.. అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావుల మనవరాలు, శోభన-అనిల్ కామినేనిల కూతురే అనుష్పాల.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram