తమన్నాకి ఉపాసన సర్‌ప్రైజ్ గిప్ట్.. అదేంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2న విడుదలైంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి రిలీజైంది. తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమా మిగిలిన భాషల్లో మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది.
కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకోవడంతో చరణ్ భార్య ఉపాసన చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా తమన్నాకు కృతజ్ఞతలు తెలుపుతూ… ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉపాసన తన ట్విట్టర్‌లో ఉంగరంతో తమన్నా దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను చాలా మిస్ అవుతున్నాను త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు.
A gift for the super @tamannaahspeaks
from Mrs Producer ?❤️?
Missing u already. Catch up soon. #SyeraaNarashimaReddy pic.twitter.com/rmVmdwWNAd— Upasana Konidela (@upasanakonidela) October 3, 2019