Upendra Gadi Adda : ‘ఉపేంద్రగాడి అడ్డా’ మూవీ రివ్యూ.. డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేయాలి అనే కమర్షియల్ కథలో..
కంచర్ల ఉపేంద్ర హీరోగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఈ సినిమా నేడు డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Upendra Gadi Adda Movie Review and Rating
Upendra Gadi Adda Review : కంచర్ల ఉపేంద్ర హీరోగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఈ సినిమా నేడు డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ విషయానికొస్తే.. ఎలాంటి బాధ్యతలు లేకుండా హ్యాపీగా తిని తన ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ తాను ఉంటున్న బంజారాహిల్స్ బస్తీని అడ్డాగా చేసుకొని కాలం గడిపేస్తుంటాడు ఉపేంద్ర. లైఫ్ లో సెటిల్ అవ్వాలనే ఆలోచనతో తన ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ఓ కోటీశ్వరుడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. దీంతో అమ్మాయిల చుట్టూ తిరగడానికి, మెయింటైనెన్స్ కి పక్క బస్తీలో ఉన్న ఓ రౌడీ షీటర్ దగ్గర అధిక వడ్డీకి అప్పు చేసి డబ్బున్న అమ్మాయిలు వచ్చే పబ్బులు చుట్టూ తిరుగుతూ చివరకు సావిత్రి అనే అమ్మాయిని లైన్‌లో పెడతాడు. ఆమెకు తాను కోటీశ్వరుడి కొడుకునని అబద్ధం చెప్పి ప్రేమ వ్యవహారం నడిపిస్తాడు. అంతలో ఆ అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో ఉపేంద్ర ఆ అమ్మాయిని ఎలా కాపాడాడు? కోటీశ్వరుడు అయ్యాడా? ఆ అమ్మాయికి నిజం చెప్పాడా అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. ఇదొక మాములు లవ్ కమర్షియల్ స్టోరీనే. ప్రేమ కథతో పాటు సోషల్ మీడియా వేదికగా చేసుకుని కొందరు అమ్మాయిలను ఎలా వేధిస్తున్నారు, వారిని ఎలా ట్రాప్ చేసి కిడ్నాప్ చేస్తున్నారు అనే అంశం చూపించారు సినిమాలో. మొదట కాసేపు బోరింగ్ గా సాగినా అమ్మాయిల కిడ్నాప్ లతో కథ ఆసక్తికరంగా మారుతుంది. అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది.
నటీనటులు, సాంకేతిక విలువలు.. కొత్త హీరో అయినా ఉపేంద్ర బాగానే నటించాడని చెప్పొచ్చు. డ్యాన్సులు, ఫైట్లతో మెప్పించాడు. మొదటి సినిమా నుంచే కమర్షియల్ హీరోగా అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ సావిత్రి కృష్ణ కూడా తన అందాలతో, నటనతో మెప్పించింది. దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మొదటి సినిమా కమర్షియల్ సబ్జెక్టు తీసుకొని ఓకే అనిపించాడు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. కెమెరా విజువల్స్, నిర్మాత కంచర్ల అచ్యుతరావు నిర్మాణ విలువలు స్క్రీన్ మీద బాగానే కనిపించాయి. ఊటీ డ్యూయెట్ సాంగ్, పబ్ సాంగ్స్, ఫైట్స్ వంటి వాటికి బాగానే ఖర్చుపెట్టారు అని తెలుస్తుంది. రీల్స్ మోజులో పడి చిక్కుల్లో పడ్డ అమ్మాయిగా హీరో చెల్లెలు పింకీ పాత్రధారి, హీరో తల్లి, తండ్రులు, అతని స్నేహితులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు.
Also Read : Animal Movie Review : యానిమల్ మూవీ రివ్యూ.. నాన్న ఎమోషన్‌కి మాస్ జోడించి ఏడిపించిన సందీప్ వంగా..
మొత్తంగా కొత్త హీరో ఉపేంద్ర ఓ మాస్ కమర్షియల్ ప్రేమ కథ చిత్రానికి కాస్త మెసేజ్ జోడించి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చిన సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం వీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..