Ustaad Bhagat Singh glimpse released on Gabbar Singh release date may 11
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాల నుంచి వారానికి ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను మేకర్స్ ఖుషీ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్.. ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమా షూటింగ్స్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఉస్తాద్ షెడ్యూల్ పూర్తి చేసి OG సెట్స్ లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ పుణేలో జరుగుతుంది. త్వరలోనే ఉస్తాద్ సెకండ్ షెడ్యూల్ మొదలు పెడతామంటూ మూవీ టీం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ షురూ.. యాక్షన్ పార్ట్!
ఉస్తాద్ ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ అండ్ హరీష్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 11తో గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి అవుతుంది. దీంతో మూవీ టీం ఆ రోజుని స్పెషల్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఆ రోజున ఉస్తాద్ నుంచి ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ అప్డేట్ తో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగా సెకండ్ షెడ్యూల్ లో పవన్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.
Pawan Kalyan OG : పుణేలో పవన్ OG షూటింగ్.. సాంగ్ షూట్ జరుగుతుందా?
పవన్ సరసన శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ అండ్ హరీష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మూవీ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్ సింగ్ కి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Rockstar @ThisIsDSP has some exciting news ??
Let’s celebrate a very special day with a blasting glimpse of #UstaadBhagatSingh on May 11th ??
Mark the date ??@PawanKalyan @harish2you @sreeleela14 @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/XTQl6QRxKy
— Mythri Movie Makers (@MythriOfficial) May 5, 2023