వినాయక్ హీరోగా ‘సీనయ్య’ ప్రారంభం
అక్టోబర్ 9 వినాయక్ పుట్టినరోజు సందర్భంగా.. ‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్).. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

అక్టోబర్ 9 వినాయక్ పుట్టినరోజు సందర్భంగా.. ‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్).. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై, ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా.. ‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్).. అక్టోబర్ 9 వినాయక్ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ.. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేసిన మూవీ టీమ్.. రీసెంట్గా ‘సీనయ్య’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది.
వినాయక్‌పై చిత్రీకరించిన ఫస్ట్ షాట్‌కి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నిచ్చారు. దర్శకులు సుకుమార్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, జి.రామ్ ప్రసాద్, వేణు శ్రీరామ్, కాశీ విశ్వనాధ్, మెహర్ రమేష్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొని మూవీ టీమ్‌ని విష్ చేశారు.
Read Also : ‘రాముడు కూడా మంచోడేరా.. కానీ రావణాసూరుణ్ణి వేసెయ్యలా’?
త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. సంగీతం : మణిశర్మ, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, మాటలు : డార్లింగ్ స్వామి, ఆర్ట్ : కిరణ్ కుమార్, నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి.
VV Vinayak in & as #Seenayya launched today.
Directed by Nnarsimmha.
DOP by Sai Sri Ram.
A Manisharma Musical.Shoot begins soon.
#HBDVVVinayak pic.twitter.com/wVUvhDwY9m
— Sri Venkateswara Creations (@SVC_official) October 9, 2019