‘నాంది’లో విభిన్నమైన క్యారెక్టర్స్ రివీల్..

  • Published By: sekhar ,Published On : June 29, 2020 / 04:04 PM IST
‘నాంది’లో విభిన్నమైన క్యారెక్టర్స్ రివీల్..

Updated On : June 29, 2020 / 4:36 PM IST

అల్లరి నరేష్ తొలిసారిగా ‘నాంది’ అనే ఓ విలక్షణమైన చిత్రంతో తెలుగు ప్రేక్షకులముందుకు రానున్నాడు. విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్.వి. 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Naresh

జూన్ 30న అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘నాంది ఎఫ్ఐఆర్’ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్  ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషిస్తున్న నటీనటులను పరిచయం చేస్తూ.. పోస్టర్స్ విడుదల చేశారు.

Varalaxmi Sarathkumar

ఈ పోస్టర్స్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ లుక్ కూడా రివీల్ చేశారు. ఈ లుక్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ నల్లకోటు చేతపట్టుకుని, మరో చేతిలో ఫైల్స్ పట్టుకుని ఠీవీగా నడిచొస్తుంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ.. ఆధ్య పాత్రలో లాయర్‌గా నటిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆమెతో పాటు రాధ ప్రకాష్ అనే పాత్రలో ప్రియదర్శి, కిశోర్ పాత్రలో హరీష్ ఉత్తమన్ నటిస్తున్నారు. లాక్‌డౌన్‌‌కి ముందే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నాంది’ చిత్రంతో నరేష్ రేపు విడుదల కాబోయే ‘ఎఫ్‌ఐఆర్‌’తో ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

Priyadarshi

Read:బిల్లు లొల్లి-సెలబ్రిటీలకూ కరెంట్ కష్టాలు