Varisu: మూడు రోజులు.. మూడు భాషలు.. అయోమయంలో వారిసు అభిమానులు!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ పొంగల్ కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తుండగా, హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ డేట్స్ విషయంపై అభిమానుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.

Varisu To Have Different Release Date For Hindi Version

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ పొంగల్ కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తుండగా, హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ డేట్స్ విషయంపై అభిమానుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.

Varisu: తన సినిమా ప్రీమియర్ చూడబోతున్న విజయ్!

ఈ చిత్రాన్ని తమిళంలో జనవరి 11న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే తెలుగులో వారసుడు మూవీని జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు తాజాగా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను హిందీ వెర్షన్‌లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. వారిసు హిందీ వెర్షన్ మూవీని జనవరి 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. గోల్డ్‌మైన్స్ వారిసు చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయనుంది.

Varisu: వారిసు సెన్సార్ టాక్.. విజయ్ ఖాతాలో మరో హిట్టు!

ఇలా తమిళ్, తెలుగు, హిందీ వెర్షన్‌లకు సంబంధించి మూడు వివిధ రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో అభిమానుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. మరి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీమధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో తెరకెక్కించగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.