Varun Sandesh
Varun Sandesh injured : సినిమా షూటింగ్‌లో యంగ్ హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh) గాయపడ్డాడు. తన కొత్త సినిమాకు సంబంధించి ఫైటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా గాయపడడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు అతడికి మూడు వారాలు విశ్రాంతి అవసరం అని సూచించారు. దీంతో చిత్ర షూటింగ్ వాయిదా వేశారు.
Devara : ఎన్టీఆర్ దేవరలో దసరా విలన్..! ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడా..?
వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఆర్యన్ శుభాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. బలగం జగదీశ్ నిర్మాత కాగా.. ఓ కానిస్టేబుల్ జీవితమే కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హైదరాబాద్ శివార్లలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫైటింగ్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా వరుణ్ సందేశ్ కాలికి గాయమైంది. వెంటనే చిత్రబృందం అతడికి ఆస్పత్రికి తీసుకువెళ్లింది.
చికిత్స అందించిన వైద్యులు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ‘ది కానిస్టేబుల్’ షూటింగ్‌ను వాయిదా వేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తైందని, వరుణ్ కోలుకున్నాక మిగతా షూటింగ్‌ను పూర్తి చేస్తామని వెల్లడించారు.
Adipurush : ఆదిపురుష్ పై టాలీవుడ్ రాముడు కామెంట్స్.. ప్రభాస్‌ను నేను అంగీకరించలేకపోయా..
‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ సందేశ్. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశాడు. అయితే ఇటీవల అతడు నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. చివరగా ‘ఇందువదన’ అనే హారర్ కామెడీతో వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం వరుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘ది కానిస్టేబుల్’ కాగా మరొకటి ‘చిత్రం చూడరా’. ఈ రెండు సినిమాలపై వరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.