Varun Sandesh Nindha Movie Trailer Released
Varun Sandesh Nindha Trailer : వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో ‘నింద’ అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు వరుణ్ సందేశ్. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా, దర్శకుడిగా నింద సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ నింద టైటిల్ కి కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ ఇచ్చారు. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు ఫిమేల్ లీడ్స్ లో నటిస్తుండగా తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Gnanasagar Dwaraka : సినిమా షూటింగ్ ప్రతి షెడ్యూల్‌లో.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రూపంలో కనిపించాడు..
ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ‘మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ట్రైలర్ చూస్తుంటే ఓ రేప్ & మర్డర్ కేసులో ఒకర్ని ఇరికిస్తే అతను తప్పుచేయకుండానే ఎవరెవరో కలిసి అతన్ని ఇరికించినట్లు, అలా చేసిన వాళ్ళందర్నీ వరుణ్ సందేశ్ ఏం చేసాడు అనే ఆసక్తికర కథాంశంతో సాగనున్నట్టు తెలుస్తుంది. నింద ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
ఇక ఈ నింద సినిమా జూన్ 21న విడుదల కాబోతుంది. మైత్రి మూవీస్ వాళ్ళు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సినిమాతో వరుణ్ సందేశ్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడని అనుకుంటున్నారు.