కొబ్బరికాయ కొడుతున్నారుగా

వరుణ్, హరీష్‌ల కాంబోలో రూపొందబోయే సినిమాకి జనవరి 27న కొబ్బరికాయ కొట్టబోతుంది మూవీ యూనిట్.

  • Published By: sekhar ,Published On : January 24, 2019 / 11:40 AM IST
కొబ్బరికాయ కొడుతున్నారుగా

వరుణ్, హరీష్‌ల కాంబోలో రూపొందబోయే సినిమాకి జనవరి 27న కొబ్బరికాయ కొట్టబోతుంది మూవీ యూనిట్.

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, ఎఫ్2 హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఎఫ్2లో, విక్టరీ వెంకటేష్‌తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్న వరుణ్, తన కొత్త సినిమాని హరీష్ శంకర్  డైరెక్షన్‌లో చెయ్యబోతున్నాడు. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన జిగర్తండా మూవీని తెలుగులో హరీష్ రీమేక్ చెయ్యనున్నాడు. ఒరిజినల్ వెర్షన్‌లో సిద్థార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ మెయిన్ లీడ్స్‌గా నటించారు. తెలుగు రీమేక్‌లో బాబీ సింహా క్యారెక్టర్‌ని వరుణ్ చెయ్యబోతున్నాడు. జిగర్తండాలో బాబీది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.

తెలుగులో వరుణ్ సెట్ అవుతాడో, లేదో అనే వార్తలు వినబడుతున్న నేపథ్యంలో, వాటికి చెక్ పెడుతూ, వరుణ్, హరీష్‌ల కాంబోలో రూపొందబోయే సినిమాకి జనవరి 27న కొబ్బరికాయ కొట్టబోతుంది మూవీ యూనిట్. సిద్ధార్థ్ క్యారెక్టర్ మరో యంగ్ హీరో చెయ్యనున్నాడని తెలుస్తుంది. లక్ష్మీ మీనన్ క్యారెక్టర్‌లో రష్మిక కనిపించనుందని సమాచారం. రీసెంట్‌గా ఎఫ్2లో, బోరబండ వరుణ్ యాదవ్‌గా తెలంగాణా యాసలో ఆకట్టుకున్న వరుణ్ తేజ్, ఈ రీమేక్‌లో నెగెటివ్ క్యారెక్టర్‌లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.