వరుణ్ తేజ్ సెల్ఫీ : కేక పుట్టిస్తున్న చెర్రీ లుక్
‘రాజమౌళి’ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ మూవీపై అందరి దృష్టి నెలకొంది. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజలు ఇందులో నటిస్తుండడం..చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీంగా నటిస్తున్నారని రాజమౌళి ప్రెస్ మీట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరు ఎలా ఉంటారనేది మాత్రం తెలియరాలేదు. ప్రెస్‌మీట్‌కు వచ్చిన సమయంలో ఇద్దరు హీరోలు క్యాప్‌లు పెట్టుకుని వచ్చారు. తాజాగా వరుణ్ తేజ సెల్ఫీతో చరణ్ లుక్ ఏంటో తెలిసిపోయింది.
‘రామ్ చరణ్’ వీలు చిక్కినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. అలా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతూ అభిమానులను ఆనందపరుస్తుంటాడు. ‘చరణ్’ రీసెంట్గా తమ్ముడు ‘వరుణ్ తేజ’తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా వారు సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను ‘వరుణ్ తేజ్’ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఫొటోలో చెర్రీ కొద్దిగా గడ్డం పెంచి..కోర మీసం..వెరైటీ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తుండడం ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. ’వరుణ్’ కూడా గుబురు గడ్డంతో ఉన్నాడు. అయితే ఈ ఫొటో ఎప్పుడు దిగారో మాత్రం తెలియరాలేదు.
ఇక వరుణ్ తేజ ఫిల్స్మ్ విషయానికి వస్తే ‘వాల్మీకి’ సినిమాలో నటించబోతున్నాడు. ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రారంభం కానుంది. తమిళంలో హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకు ఇది రీమెక్.
Randomly bumped into Mr.C in Cali!#brotherlove ❤️ pic.twitter.com/smnSQKAfIs
— Varun Tej Konidela (@IAmVarunTej) March 23, 2019