New Serials : ఒకే రోజు రెండు కొత్త సీరియల్స్ ప్రారంభం.. బ్యాక్ టు బ్యాక్ టెలికాస్ట్..

మనసుకు హత్తుకునే విధంగా ఎమోషనల్ కంటెంట్ తో వసంత కోకిల, కాంతార అనే సీరియల్స్ రాబోతున్నాయి.

New Serials : ఒకే రోజు రెండు కొత్త సీరియల్స్ ప్రారంభం.. బ్యాక్ టు బ్యాక్ టెలికాస్ట్..

Vasantha Kokila and Kantara two new Serials in Etv Telecasting starting on same day Telecasting time and date full details here

Updated On : July 1, 2024 / 4:02 PM IST

New Serials : కొత్త షోలు, సీరియల్స్ తో రెగ్యులర్ గా బుల్లితెర ప్రేక్షకులని మెప్పిస్తుంది ఈటీవీ. ఇప్పుడు ఈటీవీలో మరో రెండు కొత్త సీరియల్స్ రానున్నాయి. ఆ రెండు సీరియల్స్ కూడా ఒకే రోజు మొదలు కానుండటం విశేషం. మనసుకు హత్తుకునే విధంగా ఎమోషనల్ కంటెంట్ తో వసంత కోకిల, కాంతార అనే సీరియల్స్ రాబోతున్నాయి.

ఈ రెండు సీరియల్స్ కూడా ఈటీవీలో జులై 2వ తేదీ నుండే ప్రారంభం కాబోతున్నాయి. వసంత కోకిల సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 1: 30 నిమిషాలకు ప్రసారం కానుంది. కాంతార సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం కానుంది.

Also Read : Sudheer Babu : పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న నవ దళపతి..

వసంత కోకిల సీరియల్.. తల్లితండ్రులు ప్రపంచంగా పెరిగిన ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి జాబ్ చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటుండగా ఆమె జీవితంలోకి ఓ అబ్బాయి ప్రేమిస్తున్నా అంటూ వస్తే ఆమె తిరస్కరించినా ప్రేమ కోసం వెంటపడే అబ్బాయి, మరో వైపు కూతురికి పెళ్లి చేయాలి అనుకునే తల్లితండ్రులు.. కథాంశంతో తెరకెక్కనుంది. ఈ సీరియల్ ని జబర్దస్త్ ని నిర్మించే మల్లెమాల బ్యానర్ పై అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

View this post on Instagram

A post shared by ETV Telugu (@etvtelugu2708)

ఇక కాంతార విషయానికొస్తే.. అమాయకురాలైన అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమిస్తే ఆ ప్రేమ జంట కాకుండా ఆ అమ్మాయి ఓ యువరాజుని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఏం జరిగింది.. అనే కథాంశంతో తెరకెక్కుతుంది.