Vasudheva Sutham : ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్.. అజయ్ భూపతి చేతుల మీదుగా..
మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి.. (Vasudheva Sutham)
Vasudheva Sutham
Vasudheva Sutham : మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘వసుదేవసుతం’. రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసారు. వసుదేవసుతం సినిమా రేపు జూలై 10న రిలీజ్ అవుతుండగా తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.
RX100, మంగళవారం.. సినిమాల దర్శకుడు అజయ్ భూపతి ఈ ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
‘చంపడం నాకు సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు’, ‘కొన్ని తప్పుల్ని క్షమించొచ్చు.. అన్ని తప్పులు క్షమిస్తే.. మనం తప్పు చేసినట్టే’, ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్విడికీ భూమ్మీద బతికే హక్కు లేదు..’ అనే పవర్ ఫుల్ డైలాగ్స్‌తో యాక్షన్ సీక్వెన్స్ తో సాగింది ఈ సినిమా.
ట్రైలర్ చూసిన అజయ్ భూపతి ట్రైలర్ బాగుందని, విజువల్స్, యాక్షన్ బాగున్నాయని మూవీ యూనిట్ ని అభినందిస్తూ, సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉందని, కొత్త కథతో తీశారని సెన్సార్ సభ్యులు మూవీ యూనిట్ ని అభినందించినట్టు తెలుస్తుంది.

