Mittapalli Surender : ఐటెం సాంగ్స్, బూతు పాటలు రాయను.. పెద్ది ప్రమోషన్స్ కి అందుకే రాలేదు.. లిరిక్ రైటర్ వ్యాఖ్యలు వైరల్..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మిట్టపల్లి సురేందర్ నేడు మీడియాతో మాట్లాడారు. (Mittapalli Surender)
Mittapalli Surender
Mittapalli Surender : పలు ప్రైవేట్ సాంగ్స్, తెలంగాణ ఉద్యమ గీతాలతో గుర్తింపు తెచ్చుకున్నారు లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్. గత కొంతకాలంగా ఆయన సినిమా సాంగ్స్ కూడా రాస్తూ బిజీగా ఉన్నారు. జార్జ్ రెడ్డి సినిమాలో బులెట్ సాంగ్ తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాంబాయి సాంగ్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు.
మిట్టపల్లి సురేందర్ ఇప్పుడు మారెమ్మ సినిమాలో సాంగ్స్ రాశారు. రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ హీరోగా వస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మిట్టపల్లి సురేందర్ నేడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఐటెం సాంగ్స్ రాయను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అలాగే పెద్ది సినిమా గురించి మాట్లాడారు.
Also Read : Lenin : ‘లెనిన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..?
మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. నేను అన్ని రకాల పాటలు రాస్తాను. కమర్షియల్ సాంగ్స్ అవకాశం వస్తే రాస్తాను. కానీ ఐటెం సాంగ్స్, బూతు పాటలు మాత్రం రాయను. నా ఫ్రెండ్ ఒకతను దర్శకుడు అయ్యాడు. కమర్షియల్ సినిమా చేస్తూ నన్ను పిలిచి ఐటెం సాంగ్ రాయమన్నాడు. నేను పాట రాసాను కానీ ఇవ్వను అన్నాను. నేను రాసే పాటలు నా తల్లి, కూతురు, సోదరి అందరు వినేలా ఉండాలి. నేను రాసిన పాటని వాళ్ళు వినకుండా స్కిప్ చేసేలా ఉండకూడదు. అందుకే నేను ఐటెం సాంగ్స్ రాయను. నాకు ఐటెం సాంగ్ వల్ల సినిమా సింగిల్ కార్డు పేరు కూడా పోగొట్టుకున్నాను. అయినా నాకు పర్లేదు. చాలా ఐటెం సాంగ్స్ అవకాశాలు వచ్చినా రాయను అనే చెప్పాను అని తెలిపారు.
పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ.. నేను పెద్ది సినిమాలో రెండు పాటలు రాసాను. జగపతి బాబు పాత్ర చనిపోయినప్పుడు, క్లైమాక్స్ లో వచ్చే పాటల్ని నేనే రాసాను. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో నేను వేరే సినిమా పాటలు సిట్టింగ్స్ కి గోవాలో ఉన్నాను. అందుకే పెద్ది సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం కుదర్లేదు అని తెలిపారు.
