VC Sajjanar : దయచేసి అలాంటి వాటికి ప్రమోషన్స్ చేయకండి.. అమితాబ్ కి సజ్జనార్ రిక్వెస్ట్..

అమితాబ్ ఇటీవలే ఆమ్వే అనే న్యూట్రీషియన్ ఫుడ్ కి చెందిన సంస్థకు యాడ్స్ చేశారు. తాజాగా అమితాబ్ చేసిన ఆమ్వే కంపెనీ యాడ్ థియేటర్లో ప్లే అవ్వగా సజ్జనార్ దానిని ఫొటో తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసి........................

VC Sajjanar request to Amithab Bachchan dont do promotions for those companies

VC Sajjanar :  స్టార్ హీరోలు, సెలబ్రిటీలు యాడ్స్, ప్రమోషన్స్ కూడా చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. కొంతమంది ఈ యాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ సెలెక్టీవ్ గా చేస్తారు. కొంతమంది మాత్రం డబ్బుల కోసం అన్ని యాడ్స్ చేసేస్తూ ఉంటారు. ఇలా చేసి విమర్శల పాలైన వారు ఉన్నారు. కొంతమంది హీరోలు పాన్ మసాలా యాడ్స్, ఆల్కహాల్ యాడ్స్ చేసి విమర్శల పాలయ్యారు. అభిమానులు, నెటిజన్లు ఆ హీరోలని ఇలాంటివి చేయొద్దు అంటూ కోరారు.

తాజాగా తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఫేమస్ పోలీస్ సజ్జనార్ అమితాబ్ ని రిక్వెస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. అమితాబ్ ఇటీవలే ఆమ్వే అనే న్యూట్రీషియన్ ఫుడ్ కి చెందిన సంస్థకు యాడ్స్ చేశారు. తాజాగా అమితాబ్ చేసిన ఆమ్వే కంపెనీ యాడ్ థియేటర్లో ప్లే అవ్వగా సజ్జనార్ దానిని ఫొటో తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసి.. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారికి, ఇతర సెలబ్రిటీలకు నేను గౌరవంగా అభ్యర్థిస్తున్నాను దేశంలోని ఆర్ధిక వ్యవస్థని, సమాజంలోని సామాజిక వ్యవస్థని నాశనం చేసే ఆమ్వే వంటి మోసపూరిత సంస్థలకు ఇలా సహకరించవద్దు అని ట్వీట్ చేశారు.

Dasara Vs Bholaa : నాని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన అజయ్ దేవగణ్.. భోళా కంటే నాలుగు రేట్లు ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకున్న దసరా

దీంతో సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మరి ఆమ్వే సంస్థపై సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ కి ఆమ్వే కానీ అమితాబ్ కానీ స్పందిస్తారేమో చూడాలి. గతంలో అమితాబ్ ఇలాగే ఒక పాన మసాలా యాడ్ చేసి విమర్శలు రావడంతో ఆ యాడ్ ని క్యాన్సిల్ చేసుకున్నారు.