Allu Arjun: పుష్ప రాజ్ కాదు.. కేబుల్ రాజే టాప్ అంటోన్న ఐఎండీబీ

బన్నీ 20 ఏళ్ల సినీ కెరీర్‌లో ‘పుష్ప-ది రైజ్’ కమర్షియల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. కానీ IMDB రేటింగ్స్‌లో పుష్పరాజ్‌ను దాటేసి కేబుల్ రాజు అందరికీ షాకిచ్చాడు.

Allu Arjun: పుష్ప రాజ్ కాదు.. కేబుల్ రాజే టాప్ అంటోన్న ఐఎండీబీ

Vedam Movie Tops In IMDB List Of Allu Arjun Career

Updated On : April 8, 2023 / 10:03 PM IST

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. నేడు బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఎక్కడ చూసినా ఈ స్టార్ హీరో గురించే వార్తలు. ఆయన కెరీర్ ఎలా సాగింది.. ఆయన నటించిన సినిమాలు ఏమిటి.. వాటిలో బన్నీ చేసిన పాత్రలేమిటి.. అంటూ అభిమాలనులు తెగ చర్చించుకుంటున్నారు. ఇక మీడియాలో, వెబ్‌సైట్స్‌లో బన్నీ గురించి బోలెడన్నీ వార్తలు దర్శనమిస్తున్నాయి. అయితే ఓ ఆసక్తికరమైన వార్త మాత్రం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

Allu Arjun: ఓన్లీ హగ్స్ మాత్రమేనా.. పార్టీ లేదా పుష్ప..? అని అడిగిన తారక్

బన్నీ 20 ఏళ్ల సినీ కెరీర్‌లో ‘పుష్ప-ది రైజ్’ కమర్షియల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాను అన్నింట్లోనూ బన్నీ కెరీర్‌లో టాప్ మూవీగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఒక్కచోట మాత్రం పుష్ప టాప్-3వ సినిమాగా చోటు దక్కించుకుంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. టాప్-1 ప్లేస్‌లో దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన వేదం మూవీ నిలిచింది. ఆ సినిమాలో బన్నీ చేసిన కేబుల్ రాజు పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది.

ప్రముఖ మూవీ డేటాబేస్ వెబ్‌సైట్ IMDBలో బన్నీ కెరీర్‌లోని టాప్-10 చిత్రాలను పరిశీలిస్తే.. ఈ జాబితాలో వేదం మూవీ 8.1 రేటింగ్‌తో టాప్ ప్లేస్‌ను సాధించింది. ఇక రెండో స్థానంలో ఆర్య 7.8 రేటింగ్‌తో నిలిచింది. పుష్ప మూవీ 7.6 రేటింగ్‌తో మూడో స్థానానికి పరిమితమయ్యింది. ఇలా ఎంతో పాపులర్ అయిన IMDB రేటింగ్స్‌లో పుష్పరాజ్‌ను దాటేసి కేబుల్ రాజు అందరికీ షాకిచ్చాడు. ఇక ఈ జాబితాలో 4వ ప్లేస్‌లో ఆర్య-2(7.4), 5వ ప్లేస్‌లో అల వైకుంఠపురములో(7.3), 6వ స్థానంలో జులాయి(7.2), 7వ స్థానంలో రేసు గుర్రం(7.1), 8లో పరుగు(7.1), 9లో హ్యాపీ(7.1), 10వ ప్లేస్‌లో సన్నాఫ్ సత్యమూర్తి(7.0) నిలిచాయి.

Allu Arjun

Allu Arjun Movie List