Veera Simha Reddy: మాస్ మొగుడు సాంగ్ వాయిదా.. ట్రైలర్‌తో దుమ్ములేపేందుకు రెడీ అవుతున్న వీరసింహారెడ్డి!

Veera Simha Reddy Mass Mogudu Song To Be Released Later
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెనసేషన్ క్రియేట్ చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. కాగా ఈ సినిమా నుండి మాస్ మొగుడు అనే మరో మాస్ డ్యుయెట్ సాంగ్‌ను రేపు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Veera Simha Reddy: వీరసింహారెడ్డి నుండి ‘మాస్ మొగుడు’గా వస్తున్న బాలయ్య!
కానీ, తాజాగా ఈ సాంగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేసింది. మాస్ మొగుడు సాంగ్‌ను వాయిదా వేస్తున్నామని.. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో సాంగ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌తో సర్‌ప్రైజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Veera Simha Reddy: దుమ్ములేపుదాం.. థియేటర్ ఓనర్లు ప్రీపేర్ కావాలంటోన్న థమన్
బాలకృష్ణ రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో అలరించనుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.
#MassMogudu Song will be out on a later date!
Get ready for #VeeraSimhaReddy Massive Trailer & Event announcements very soon ??#VeeraSimhaReddyOnJan12th
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/5Ba0IOkAnJ
— Mythri Movie Makers (@MythriOfficial) January 2, 2023