వెంకటేష్ ‘సైంధవ్‌’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..

వెంకటేష్ 'సైంధవ్‌' చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ రివ్యూలు ఇస్తున్నారు.ఫస్ట్ హాఫ్..

వెంకటేష్ ‘సైంధవ్‌’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..

Venkatesh 75th Movie Saindhav twitter review and public talk

Updated On : January 13, 2024 / 10:15 AM IST

Saindhav Twitter Review : హిట్ సినిమా ఫేం శైలేష్‌ కొలను దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్ తన 75వ సినిమాగా ‘సైంధవ్‌’తో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు నటిస్తున్నారు. నేడు ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.

Also read :  ‘గుంటూరు కారం’ రివ్యూ.. పండక్కి ఘాటు ఎక్కించి.. ఎమోషన్‌తో కన్నీళ్లు తెప్పించిన బాబు..

ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ రివ్యూలు ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందని, ఇంటర్వెల్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ అయితే అదుర్స్ అంటున్నారు.

శైలేష్ కొలను కథని చాలా బాగా నడిపించాడని, వెంకటేష్ తన పాత్రని అదరగొట్టేశారని చెబుతున్నారు.


మొదటి 30 నిముషాలు కొంచెం స్లోగా సాగుతుందని, ఆ తరువాత నుంచి అసలు కథ మొదలవుతుందట. వెంకటేష్ యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయని చెబుతున్నారు. బీజీఎమ్ హైలైట్ అంటున్నారు.


ఫస్ట్ హాఫ్ బాగుందట. వెంకటేష్ పాత్ర హైలైట్ అంట. మిగిలిన పాత్రలు కూడా ఆ రోల్స్ కి తగ్గట్టు బాగా నటించారట. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇదే పర్ఫెక్ట్ చాష్త్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ అదిరిపోయిందట. సెకండ్ హాఫ్ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెబుతున్నారు. BGM బాగుందట.