కరోనా కట్టడికి ముచ్చటగా మూడు సూత్రాలు..

  • Published By: sekhar ,Published On : October 8, 2020 / 05:17 PM IST
కరోనా కట్టడికి ముచ్చటగా మూడు సూత్రాలు..

Updated On : October 8, 2020 / 5:28 PM IST

#Unite2FightCorona Venkatesh -Mahesh Babu: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన #JanAndolan లో భాగంగా మనమందరం కరోనాకు వ్యతిరేకంగా పోరాడాలని, మాస్క్ ధరించి, చేతులు శుభ్రం చేసుకోవాలని, అలాగే సామాజిక దూరం పాటించాలని, ఇండియాను సురక్షితంగా ఉంచడానికి ఈ మూడు సూత్రాలు ముఖ్యమని విక్టరీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు వెంకీ.



కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కలిసికట్టుగా పోరాడం ఒక్కటే మార్గమని సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ప్రధాని విజ్ఞప్తి మేరకు ప్రతిఒక్కరూ కరోనా కట్టడికి ఏకం కావాలని అన్నారు. అలాగే ఎల్లప్పుడు మాస్క్ ధరించాలి, చేతులు శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా సామాజిక దూరం పాటించాలని మహేష్ తెలిపారు.

కరోనాను తరిమికొట్టడానికి సింపుల్ రూల్స్ పాటించడమే సరైన వ్యాక్సిన్ అంటూ కింగ్ నాగార్జున ట్వీట్ చేశారు.