Venkatesh : తిరుమలలో దగ్గుబాటి కొత్త జంట.. వెంకటేష్ కూతురు అల్లుడి వీడియో వైరల్..

తిరుమలలో దగ్గుబాటి కొత్త జంట సందడి చేసారు. శ్రీవారిని దర్శించుకున్న వెంకటేష్ కూతురు అల్లుడి..

Venkatesh : తిరుమలలో దగ్గుబాటి కొత్త జంట.. వెంకటేష్ కూతురు అల్లుడి వీడియో వైరల్..

Venkatesh daughter and son in law at tirumala video gone viral

Updated On : March 25, 2024 / 4:58 PM IST

Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇటీవల తన రెండో కూతురు ‘హవ్యవాహిని’ని అత్తారింటికి పంపించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం అక్టోబర్‌లో వెంకీమామ తన కుమార్తె ఎంగేజ్మెంట్ ని ఎటువంటి హడావుడి లేకుండా జరిపించేసారు. ఆ తరువాత పెళ్లిని కూడా అదే తరహాలో సైలెంట్ గా కానించేశారు. మార్చ్ 15న హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో కేవలం ఇరు కుటుంబసభ్యుల మధ్య దగ్గుబాటి పెళ్లివేడుక జరిగిపోయింది.

వెంకీ మామ తన కూతురు హవ్యవాహినిని విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు తనయుడు డాక్టర్ నిషాంత్కి ఇచ్చి పెళ్లి చేసారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా పెద్దగా బయటకు రాలేదు. కేవలం ఒకటిరెండు పిక్స్ మాత్రమే నెట్టింట వైరల్ అయ్యాయి.

Also read : Prabhas : ఫృధ్వీరాజ్ దర్శకత్వంలో ప్రభాస్.. సలార్ 2లో ప్రభాస్ డైలాగ్స్..

Venkatesh daughter and son in law at tirumala video gone viral

తాజాగా ఈ దగ్గుబాటి కొత్త జంట తిరుమలలో సందడి చేసారు. పెళ్ళైన తరువాత శ్రీవారు అశీసులు తీసుకోవడం కోసం హవ్యవాహిని, నిశాంత్ నేడు తిరుమల వచ్చారు. ఈ కొత్త జంటతో వెంకటేష్ కుటుంబం ఎవరు కనిపించలేదు. కేవలం వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రమే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా వెంకటేష్‌కు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. ఇప్పుడు రెండో కుమార్తె కూడా ఏడడుగులు వేసి అత్తారింటికి వెళ్లారు. ఇది ఇలా ఉంటే, వెంకటేష్ లాంటి స్టార్ హీరో తన కూతురి పెళ్లిని చాలా సింపుల్ గా చేసేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ వెంకటేష్ సింప్లిసిటీ అందరికి తెలిసిందే. పర్సనల్ లైఫ్ గురించి చాలా లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తూ వస్తుంటారు. ఆ క్రమంలోనే పెళ్లిని కూడా సింపుల్ గా చేసేసి ఉంటారు.