Venkatesh – Nani : నాకు వెంకటేష్ సార్‌కి ఉన్న గొప్ప వరం అదే.. నాని కామెంట్స్..

హాయ్ నాన్న, సైంధవ్‌ ప్రమోషన్స్ ని ఒకటిగా నిర్వహిస్తూ వెంకీ, నాని కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో..

Venkatesh – Nani : నాకు వెంకటేష్ సార్‌కి ఉన్న గొప్ప వరం అదే.. నాని కామెంట్స్..

Venkatesh Nani special interview on Hi Nanna Saindhav promotions

Updated On : December 5, 2023 / 6:23 PM IST

Venkatesh – Nani : విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నాని తమ యాక్టింగ్ తో ఆడియన్స్ ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఎమోషనల్ చేస్తారు. ఇలా వీరిద్దరిలో కామన్ పాయింట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తో తమ కొత్త సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. నాని ‘హాయ్ నాన్న’, వెంకటేష్ ‘సైంధవ్‌’ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ ని ఒకటిగా నిర్వహిస్తూ వెంకీ, నాని కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్, నానితో మాట్లాడుతూ.. “ఎమోషన్ సీన్స్ చేయడం కొందరు హీరోలకు మాత్రమే బాగుటుంది. ఇతర హీరోలు ఏడిపించే సీన్స్ చేస్తే ఆడియన్స్ కూడా అంగీకరించలేరు. కానీ మనం ఇద్దరం ఎమోషనల్ సీన్స్ చేస్తే ఆడియన్స్ కి నచ్చుతుంది. ఇది మనకి ఒక బహుమతి” అని చెప్పుకొచ్చారు. దీనికి నాని బదులిస్తూ.. “మన ఇద్దరిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి సార్. కామెడీ, ఎమోషన్, మాస్.. ఈ మూడింటిలో మిమ్మల్ని అంగీకరించినట్లే నన్ను కూడా అంగీకరించారు. ఇది మన ఇద్దరికీ ఉన్న గొప్ప వరం” అంటూ పేర్కొన్నారు.

Also read : Jersey : జెర్సీ సినిమా వెంకటేష్ చేయాల్సిందట.. ఆయన కోసం రాసిన కథని నాని..

ఇక హాయ్ నాన్న విషయానికి వస్తే.. డిసెంబర్ 7న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంటే శృతిహాసన్ ఓ ప్రత్యేక పాటలో కనిపించబోతున్నారు. అలాగే ‘సైంధవ్‌’ విషయానికి వస్తే.. శైలేష్‌ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వెంకటేష్ 75వ చిత్రంగా వస్తుంది. నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.