Venkatesh Talks about Dhoni and 2011 World cup in Balayya Unstoppable Show
Venkatesh – Dhoni : వెంకటేష్ కి క్రికెట్ అంటే ఎంత పిచ్చో అందరికి తెలిసిందే. వెంకటేష్ కు ఖాళీగా ఉంటే ఇండియా మ్యాచ్ లు ఎక్కడున్నా వెళ్లి చూస్తారు. చాలా సార్లు క్రికెట్ స్టేడియంలలో వెంకటేష్ కనిపించారు. మన ఇండియన్ క్రికెట్ మేనేజ్మెంట్ తో కూడా వెంకటేష్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో క్రికెటర్స్ ని కూడా కలుస్తాడు. వెంకటేష్ చూడటమే కాదు క్రికెట్ బాగా ఆడతాడు కూడా.
Also Read : Bobbili Raja : వంద పాములతో ఆ సీన్ చేశాను.. బొబ్బిలిరాజా సినిమా గురించి బాలయ్య షోలో వెంకటేష్ కామెంట్స్..
అయితే తాజాగా ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన వెంకటేష్ కి బాలయ్య నుంచి క్రికెట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో వెంకీమామ 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పటి సంగతుల గురించి పంచుకున్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ.. 2011 ఫైనల్స్ లో ముంబైలోనే ఉన్నాను. వరల్డ్ కప్ గెలిచాక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాను. ధోని, సచిన్, విరాట్ అందరూ ఉన్నారు. ధోనితో మాట్లాడుతున్నాను. అంతలో వన్ మినిట్ అని చెప్పి లోపలికి వెళ్లి మళ్ళీ బయటకు వచ్చి ట్రిమ్మర్ తో అక్కడే మొత్తం జుట్టు తీసేసుకున్నాడు. అందరూ షాక్ అయ్యారు అని తెలిపాడు.
2011 వరల్డ్ కప్ వరకు ధోని జులపాల జుట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తెల్లారే వరల్డ్ కప్ తో గుండుతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. అప్పట్లో ధోని ఆ లుక్స్ తో బాగా వైరల్ అయ్యాడు. ఆ లుక్స్ గురించి ఇప్పుడు వెంకటేష్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Also Read : Venkatesh : మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ కు నాకు అదే కనెక్ట్ అయింది.. బాలయ్య షోలో వెంకటేష్ కామెంట్స్..
ఇక ఎపిసోడ్ కి వెంకటేష్ తో పాటు అనిల్ రావిపూడి, సురేష్ బాబు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, భీమ్స్ సిసిరోలియో కూడా వచ్చి సందడి చేశారు. సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో వస్తుండగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రానున్నారు.