అక్కినేని అభిమానులకు చైతు బర్త్‌డే ట్రీట్ రెడీ!

నవంబర్ 23న యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ రివీల్ చేయనున్నారు మూవీ టీమ్..

  • Published By: sekhar ,Published On : November 21, 2019 / 09:45 AM IST
అక్కినేని అభిమానులకు చైతు బర్త్‌డే ట్రీట్ రెడీ!

Updated On : November 21, 2019 / 9:45 AM IST

నవంబర్ 23న యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ రివీల్ చేయనున్నారు మూవీ టీమ్..

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వెంకీ మామ’.. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ మరియు పాటలకు మంచి స్పందన వస్తోంది. నవంబర్ 23న చైతన్య పుట్టినరోజు.. ఈ సందర్భంగా అక్కినేని అభిమానుల కోసం ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ చేసింది వెంకీమామ టీమ్.

గురువారం మధ్యాహ్నం, శనివారం సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఈ సినిమాలో చైతు మిలటరీ సోల్జర్‌‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే.. ‘కెప్టెన్ కార్తీక్ నవంబర్ 23న మిమ్మల్ని కలవబోతున్నాడు’ అంటూ అప్‌డేట్ ఇచ్చారు. దీని బట్టి చైతు న్యూ పోస్టర్ కానీ, న్యూ టీజర్ కానీ విడుదల చేయనున్నారని అర్ధమవుతోంది.

Read Also : రేపు జార్జిరెడ్డి మళ్లీ పుడుతున్నాడు: డైరెక్టర్ జీవన్‌రెడ్డి

ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు: సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
బ్యానర్స్: సురేష్ ప్రొడక్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
కో ప్రొడ్యూస‌ర్‌: వివేక్ కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి