గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూత..

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూత..
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు గురువారం మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని లైఫ్‌లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన మారుతీరావు నాటకరంగం నుంచి సినిమారంగం వైపు వచ్చి.. నటనా, రచనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. కథలు, నవలా రచనతో పాటు జర్నలిస్ట్, టివి యాంకర్, స్క్రీన్ రైటర్, యాక్టర్, ఎడిటర్, డైరెక్టర్ ఇలా విభిన్న రంగాలలో కూడా పట్టు ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
కామెడీ, విలనీ, సెంటిమెంట్ పాత్ర ఏదైనా తన నటనతో సదరు పాత్రకే వన్నె తీసుకొచ్చేవారు గొల్లపూడి. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. గొల్లపూడి మరణవార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నారు.