ప్రముఖ హాస్యనటుడు జగదీప్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్ 81 సంవత్సరాల వయసులో మరణించారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యలతో బుధవారం రాత్రి 8గంటల 40నిమిషాలకు ముంబైలోని తన ఇంటిలో చనిపోయారు. జగదీప్ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. 29 మార్చి 1939 న జన్మించాడు. జగదీప్ 400కి పైగా చిత్రాల్లో చేశారు. 1975లో షోలే సినిమాలో సుర్మా భోపాలి పాత్రతో అందరికీ దగ్గరయ్యాడు జగదీప్.
‘పురాణ మందిర్’ చిత్రంలో, ‘అండజ్ అప్నా అప్నా’ చిత్రంలో సల్మాన్ ఖాన్ తండ్రి పాత్రలో కూడా అతను ప్రేక్షకులను మెప్పించాడు. జగదీప్ 1951 లో బిఆర్ చోప్రా చిత్రం ‘అఫ్సానా’తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో జగదీప్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు.
‘హమ్ పచ్చి ఏక్ దళ్ కే’ చిత్రంలో ఆయన చేసిన కృషి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. భారతదేశ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా జగదీప్‌ను ప్రశంసించారు. జగదీప్ కుమారులు జావేద్ జాఫ్రీ మరియు నవేద్ జాఫ్రీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనే ఉన్నారు.
గత మూడు నెలల్లో బాలీవుడ్‌కు చెందిన ఐదుగురు ప్రముఖులు ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఏప్రిల్‌లో ఇర్ఫాన్‌ఖాన్ , రిషి కపూర్ చనిపోగా.. తరువాత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే నెలలో సరోజ్ ఖాన్ చనిపోయారు. ఇప్పుడు జగదీప్ చనిపోయారు.