Pritish Nandy : ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్‌ నంది క‌న్నుమూత‌

ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్‌ నంది క‌న్నుమూశారు.

Veteran journalist filmmaker poet Pritish Nandy dies at 73

ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్‌ నంది క‌న్నుమూశారు. ముంబైలోని త‌న నివాసంలో బుధ‌వారం గుండెపోటుతో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌న‌ వ‌య‌స్సు 73 సంవ‌త్స‌రాలు. ఆయ‌న మ‌ర‌ణించిన వార్త‌ను కుమారుడు కుష‌న్ నంది ధృవీక‌రించారు. ప్రితీశ్‌ నంది మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

నేనొక మంచి స్నేహితుడిని కోల్పోయాడు. ప్రితీశ్‌ నంది మ‌ర‌ణ‌వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యాను. అద్భుత‌మైన క‌వి, ర‌చ‌యిత‌, నిర్మాత‌, ధైర్య‌వంతుడు, అద్వితీయ‌మైన సంపాద‌కుడు అంటూ అనుప‌మ్ ఖేర్ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్ల‌డించారు. తాను కలిసిన అత్యంత నిర్భయ వ్యక్తులలో ఆయన ఒకరని అన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాన్న‌ట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా తాము తరచుగా కలుసుకోలేద‌ని, అయిన‌ప్ప‌టికి మేము స‌న్నిహితంగా ఉండేవాళ్ల‌మ‌ని చెప్పారు.

Dil Raju : గేమ్ ఛేంజర్ సినిమా కోసం చరణ్ ఇంకో సినిమా వదులుకున్నాడు.. సంవత్సరం లేట్ అయింది..

ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌, మీరాబాయ్‌ నాటౌట్, అగ్లీ ఔర్‌ పాగ్లీ, షాదీ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వంటి చిత్రాలను ప్రితీశ్‌ నిర్మించారు. జర్నలిస్టుగానూ సుపరిచితుడైన ఆయ‌న ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌ల్లో ప‌ని చేశారు. 1977లో ప‌ద్మ‌శ్రీ, 2008లో క‌ర్మ‌వీర్ పుర‌స్కార్‌, 2012లో ఇంట‌ర్నేష‌న‌ల్ హ్యుమానిటేరియ‌న్ అవార్డు లు అందుకున్నారు.

మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 50 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల జాతీయ కమిటీ, రక్షణ కోసం పార్లమెంటరీ కమిటీ, కమ్యూనికేషన్స్ కోసం పార్లమెంటరీ కమిటీ, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీతో సహా అనేక కమిటీలలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అప్‌గ్రేడేషన్ కోసం నిపుణుల కమిటీకి నంది నాయకత్వం వ‌హించారు.

AP High Court : గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు షాక్.. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!