AP High Court : గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు షాక్.. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!

AP High Court : గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మూవీ టికెట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేవలం 10 రోజుల వరకు అనుమతినిచ్చింది.

AP High Court : గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు షాక్.. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!

Game Changer and Daku MahaRaj Movies

Updated On : January 8, 2025 / 9:58 PM IST

AP High Court : సంక్రాంతికి రానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మూవీలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. సినిమాలకు విడుదలకు సంబంధించి టికెట్ల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేవలం 10 రోజుల వరకు మాత్రమే టికెట్ ధరలను పెంచుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. సినిమా టికెట్ ధరలను 14 రోజులు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు టికెట్ల ధరల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Read Also : Ram Charan : నానమ్మ అంటే చరణ్ కి ఎంత ఇష్టమో.. చరణ్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?

సంక్రాంతి సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలపై కూడా అదే స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాల టికెట్లకు సంబంధించి ధరలను పెంచాలని సినీనిర్మాతలు ఏపీ సర్కార్‌ను కోరారు. అయితే, ప్రభుత్వం టికెట్ ధరలను పెంపునకు అనుమతించింది.

10 రోజులకు పరిమితం చేస్తూ ఆదేశాలు :
టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై వ్యతిరికేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైకోర్టు సినిమా టికెట్ల ధరల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో సినిమాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ప్రేక్షకులు కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Game Changer and Daku MahaRaj Movies

AP High Court : Game Changer and Daku MahaRaj Movies

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలియాభట్ జంటగా నటించారు. ఈ మూవీలో దర్శకుడు ఎస్ జే సూర్య విలన్‌గా నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కానుంది.

ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ మూవీలో నట సింహం నందమూరి బాలకృష్ణ నటించగా, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also : Ram Charan Daughter : నేను ఆ భారం అనుభవించాను.. అందుకే చూపించట్లేదు.. బాలయ్య షోలో కూతురు గురించి చెప్తూ చరణ్ ఎమోషనల్..